
ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల (డక్‌వర్త్ లూయిస్) తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దాయాదుల మధ్య పోరు నేపథ్యంలో ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని మ్యాచ్ చూసేందుకు ఆసక్తి కనబరిచారు. ఇక ఆదివారం కూడా కావడంతో ప్రతి ఒక్కరు టీవీకి అతుక్కుపోయారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
భారత్-పాక్‌తో తలపడుతున్న నేపథ్యంలో బీఎస్‌ఎఫ్ జవాన్లు కూడా మ్యాచ్‌ను తిలకించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న బీఎస్‌ఎఫ్ హెడ్‌క్వార్టర్ వద్ద భారత్-పాక్ మ్యాచ్‌ను తిలకిస్తూ.. టీమిండియాకు చీర్ చెప్పారు. అంతేకాదు డోలు వాయిస్తూ భారత్.. భారత్ అంటూ తమ మద్దతు తెలిపారు. పంజాబీ డాన్సుతో బీఎస్‌ఎఫ్ జవాన్లు అందరిని ఆకర్షించారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.
రోహిత్ శర్మ (140) భారీ శతకం.. కోహ్లీ (77), రాహుల్ (57) హాఫ్ సెంచరీలు చేయడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 336 పరుగులు చేసింది. పాక్ పేసర్ ఆమిర్‌కు మూడు వికెట్లు తీసాడు. లక్ష్య ఛేదనలో పాక్ స్కోర్ 166/6 వద్ద వర్షం పడడంతో పాక్ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302 పరుగులుగా నిర్ణయించారు. కానీ పాక్ ఆరు వికెట్లకు 212 పరుగులే చేసి ఓడింది. ఫఖర్ జమాన్ (62), బాబర్ ఆజమ్ (48), ఇమాద్ వసీమ్ (46 నాటౌ ట్) రాణించారు. కుల్దీప్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యాలకు రెండేసి వికెట్లు తీశారు.