
హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా గురువారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కి వరుణుడు అంతరాయం కలిగిస్తున్నాడు. ఉదయం నుంచి నాటింగ్‌హామ్‌లో చిరుజల్లులు కురుస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు నాటింగ్ హామ్‌లో చిరుజల్లులు కురిశాయి.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ జరుగుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే, వర్షం కారణంగా మైదానం మొత్తం తడిసిపోవడంతో సిబ్బింది గ్రౌండ్‌ను ఆరబెడుతుండటంతో టాస్ ఆలస్యం కానుంది. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం గం. 2.30 ని.లకు టాస్ వేయాల్సి ఉన్నప్పటికీ ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటం చేత ఆటకు అంతరాయ ఏర్పడింది.
ఆ తర్వాత అంఫైర్లు 3 గంటల సమయంలో మళ్లీ పిచ్‌ను సందర్శించేందుకు వెళ్లే సమయంలో చిరు జల్లులతో కూడిన వర్షం ప్రారంభమైంది. దీంతో పిచ్‌ను మైదాన సిబ్బంది కవర్లతో కప్పారు. మైదాన సిబ్బంది మాత్రం నీటిని తోడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం 3.30 కు మరోసారి గ్రౌండ్‌ను తనిఖీ చేసిన అనంతరం టాస్‌పై నిర్ణయం తీసుకోనున్నారు.
న్యూజిలాండ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు టోర్నీలో టీమిండియా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన మంచి జోరు మీదుంది. బలాబలాలపరంగా చూస్తే ఇరు జట్లు పటిష్టంగానే ఉన్నాయి.
జట్లు అంచనా:
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, రాహుల్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా, మహేంద్ర సింగ్ ధోని, కేదార్ జాదవ్, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా.
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్టిన్ గప్టిల్, నికోల్స్, రాస్ టేలర్, టామ్ లాథమ్, జేమ్స్ నీషమ్, మిచెల్ సట్నర్, కొలిన్ డీ గ్రాండ్‌హోమ్, టిమ్ సౌథీ, లూకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్.
{headtohead_cricket_3_4}