For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌.. మట్టి వాసన చూసి బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ

ICC Cricket World Cup 2019 : Virat Kohli Receives Soil From School Ahead Of India vs Australia Clash
CWC19, India vs Australia: Virat Kohli Receives Soil From his School Ahead Of India vs Australia Match

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సొంత గడ్డ (మాతృభూమి)పై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మ్యాచ్‌కు ముందు కోహ్లీ తాను చదివిన పాఠశాల మైదానంలోని మట్టి వాసన చూసి బరిలోకి దిగాడు. దీంతో సొంత గడ్డపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

తొమ్మిదో గ్రేడ్‌ వరకు:

తొమ్మిదో గ్రేడ్‌ వరకు:

డిల్లీ ఉత్తమ్‌ నగర్‌లోని విశాల్‌ భారతి స్కూల్లో కోహ్లీ తొమ్మిదో గ్రేడ్‌ వరకు చదువుకున్నాడు. తొమ్మిదో గ్రేడ్‌ చదువుతుండగానే 1998లో వెస్ట్‌ ఢిల్లీ క్రికెట్‌ అకాడమీలో చేరాడు. అనంతరం 2008లో విరాట్ సారథ్యంలో అండర్-19 కప్ గెలుచుకుంది భారత్. దీంతో 2008లో భారత జట్టులో చోటు సంపాదించాడు. అనంతరం 2011 ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు.

మట్టి వాసన చూసి బరిలోకి:

ఆపై క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తూ తనదైన ముద్ర వేసాడు. ఇప్పుడు టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నాడు. కోహ్లీకి ఇదే మొదటి ప్రపంచకప్‌ కావడంతో.. మన జట్టు ప్రపంచకప్‌ సాధించాలని ఢిల్లీలో అతను విద్యనభ్యసించిన విశాల్‌ భారతి పబ్లిక్‌ స్కూల్‌.. ఓ బాక్సులో మట్టిని లండన్‌ పంపించింది. ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు ఆ మట్టి వాసనను చూసి కోహ్లీ బరిలోకి దిగాడు. ఆ సమయంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, కోచ్‌ రవిశాస్త్రి కూడా కోహ్లీ పక్కనే ఉన్నారు. అనంతరం తన చిన్ననాటి జ్ఞాపకాలను కూడా కోహ్లీ గుర్తు చేసుకున్నాడు.

ఆస్ట్రేలియాపై ఘన విజయం:

ఆస్ట్రేలియాపై ఘన విజయం:

ఈ మ్యాచ్‌లో భారత్‌ 36 పరుగుల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (109 బంతుల్లో 117; 16 ఫోర్లు) సెంచరీ చేయగా.. విరాట్‌ కోహ్లీ(77 బంతుల్లో 82; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (70 బంతుల్లో 57; 3 ఫోర్లు, 1 సిక్స్‌), హార్దిక్‌ పాండ్యా (27 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) లు రాణించారు. అనంతరం ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 316 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్‌ స్మిత్‌ (70 బంతుల్లో 69; 5 ఫోర్లు, 1 సిక్స్‌), డేవిడ్‌ వార్నర్‌ (84 బంతుల్లో 56; 5 ఫోర్లు), అలెక్స్‌ క్యారీ (35 బంతుల్లో 55 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌)లు అర్ధ సెంచరీలు చేశారు. బుమ్రా, భువనేశ్వర్‌ చెరో 3 వికెట్లు తీశారు.

Story first published: Monday, June 10, 2019, 9:19 [IST]
Other articles published on Jun 10, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+