
ఐసీసీ దృష్టిసారించాలి:
భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తుండగా.. ఆడమ్ జంపా తన తొలి స్పెల్ వేస్తున్నాడు. ఈ సమయంలో అతను పదే పదే ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టి తీయడం, తర్వాత బంతిని రుద్దడం వంటివి చేసాడు. నెటిజన్లు ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి జంపా తీరు అనుమానాస్పదంగా ఉందని, దీనిపై ఐసీసీ దృష్టిసారించాలని అభిప్రాయపడ్డారు. ఐతే జంపా కచ్చితంగా టాంపరింగ్‌కు పాల్పడ్డాడని ఆ దృశ్యాలలో స్పష్టంగా తెలియట్లేదు.
|
హ్యాండ్ వార్మర్:
ఈ సందేహాలపై ఆసీస్ మేనేజ్మెంట్ స్పష్టత ఇచ్చింది. జంపా హ్యాండ్ వార్మర్ సాధనాన్ని ఉపయోగిస్తాడని, అతని జేబులో ఉన్నది అదేనని తెలిపింది. హ్యాండ్ వార్మర్‌ను జంపా తరచుగా ఉపయోగిస్తాడు. చల్లని వాతావరణంలో బంతిపై పట్టుచిక్కడం కోసం దాన్ని పదేపదే వాడుతారు అని పేర్కొంది. బిగ్‌బాష్ లీగ్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కూడా జంపా ఉపయోగిస్తాడని స్పష్టం చేసింది.

ఫొటోలను ఇంకా చూడలేదు:
ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై స్పందించాడు. 'ఈ ఘటనకు సంబందించిన ఫొటోలను ఇంకా చూడలేదు. జంపా జేబులో మాత్రం హ్యాండ్ వార్మర్ ఉంటుందని తెలుసు. ప్రతి మ్యాచ్‌లో దాన్ని ఉపయోగిస్తాడు. బహుశా అదే ఉండి ఉంటుంది. ఆ ఫొటోలను చూడలేదు కాబట్టి ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడలేను' అని తెలిపాడు.

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో కూడా:
గతేడాది నవంబర్‌లో కూడా జంపాకు ఇలాంటి ఆరోపణలనే ఎదురయ్యాయి. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ సందర్భంగా ఈ తరహా ఫొటోలు, వీడియోలు టాంపరింగ్ సందేహాలను కలిగించాయి. అనంతరం అతడు హ్యాండ్ వార్మర్ ఉపయోగిస్తాడని తేలింది. బహుశా ఇప్పుడు కూడా జంపా అదే ఉపయోగించి ఉంటాడు. బాల్ టాంపరింగ్ ఉదంతంలో కూరుకున్న ఆసీస్ జట్టు.. మళ్లీ అలాంటి సాహసం చేయబోదు.