Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లండ్, విండీస్ అమీతుమీ.. బౌలింగ్‌కు పరీక్షే

CWC19, England vs West Indies match Preview: Hosts look to continue dominance against spirited Windies

ప్రపంచకప్‌లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా శుక్రవారం ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో బ్యాట్, బంతికి మధ్య సమరం జరగనుంది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఇంగ్లిష్ బ్యాట్స్‌మన్‌కు, పటిష్ట విండీస్ పేస్ కు మధ్య పోరు జరుగనుంది. మరోవైపు విండీస్‌ జట్టులో భారీ హిట్టర్లు కూడా ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఇరు జట్లకు ఇది నాలుగో మ్యాచ్‌. రెండు విజయాలు, ఒక ఓటమితో ఇంగ్లండ్‌ నాలుగు పాయింట్లతో ఉండగా.. ఒక విజయం, ఒక ఓటమి, ఒక మ్యాచ్‌ రద్దుతో విండీస్‌ ఖాతాలో మూడు పాయింట్లున్నాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

గాడిలో పడిన ఇంగ్లండ్:

గాడిలో పడిన ఇంగ్లండ్:

తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను సునాయాసంగా ఓడించిన ఇంగ్లండ్‌కు రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ షాకిచ్చింది. వెంటనే కోలుకున్న ఇంగ్లాండ్.. బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధించింది. ఓపెనర్‌ జేసన్‌ రాయ్, జో రూట్, బట్లర్‌ ఫామ్‌లో ఉండటం కలిసొస్తోంది. బెయిర్‌ స్టో, కెప్టెన్‌ మోర్గాన్‌ పరుగులు చేయాల్సి ఉంది. చివరలో అలీ, స్టోక్స్ బ్యాట్ జులిపించగలరు. బౌలింగ్‌లో ఆర్చర్‌ దుమ్ములేపుతున్నాడు. వోక్స్, ప్లంకెట్ రాణిస్తున్నారు. రషీద్‌ స్పిన్‌ మధ్య ఓవర్లలో కీలకం.

బ్యాటింగే సమస్య:

బ్యాటింగే సమస్య:

బౌలింగ్‌ ఎంత బలంగా ఉందో విండీస్‌ బ్యాటింగ్‌ కూడా అంతే బలంగా ఉంది. అయితే నిలకడలేమి బ్యాటింగే ఆ జట్టు ప్రధాన సమస్య. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం కారణంగా ఓడిపోయింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ రద్దయింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ విండీస్ జట్టుకు కీలకం. విధ్వంసక క్రిస్‌ గేల్‌ ఇంకా పూర్తిస్థాయిలో విజృంభించలేదు. ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ ఫామ్‌లో లేడు. పూరన్, హెట్‌మైర్‌ రాణించాల్సి ఉంటుంది. హిట్టర్లు హోల్డర్, రసెల్ చెలరేగితే పరుగుల ప్రవాహమే. బ్రాత్‌వైట్, కార్టెల్, హోల్డర్, రస్సెల్, థామస్ లు చెలరేగితే ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌కు కష్టాలు తప్పవు.

వర్షం ముప్పు:

వర్షం ముప్పు:

ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణం అయ్యాయి. ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. గురువారం సౌతాంప్టన్‌లోనూ భారీ వర్షం పడింది. దీంతో విండీస్ ప్లేయర్లు ఇండోర్‌లోనే ప్రాక్టీస్ చేశారు. శుక్రవారం కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావం మ్యాచ్‌పై పడొచ్చు.

ముఖాముఖి రికార్డు:

ముఖాముఖి రికార్డు:

ఇరు జట్లు ఇప్పటివరకు 101 మ్యాచ్‌లు ఆడాయి. ఇంగ్లండ్‌ 51 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. వెస్టిండీస్‌ 44 గెలిచింది. ఆరు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ప్రపంచకప్‌లో మాత్రం ఇంగ్లండ్‌దే పైచేయి. విండీస్‌తో ఆరు సార్లు తలపడగా.. ఐదుసార్లు ఇంగ్లండే గెలిచింది. 1979 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో మాత్రమే విజయం సాధించింది.

1
43662

{headtohead_cricket_2_8}

Story first published: Friday, June 14, 2019, 8:08 [IST]
Other articles published on Jun 14, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+