న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌.. ఉత్కంఠ పోరులో బంగ్లాపై కివీస్‌ విజయం

CWC19, Bangladesh vs New Zealand: Ross Taylor Stars As New Zealand Survive Bangladesh Scare To Win World Cup Thriller

హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో చివరకు న్యూజిలాండ్‌నే విజయం వరించింది. ఈ విజయంతో కివీస్‌ ప్రపంచకప్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. సీనియర్ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ ( 82; 91 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించడంతో బుధవారం బంగ్లాదేశ్‌తో రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో కివీస్‌ 2 వికెట్ల తేడాతో నెగ్గింది. 245 పరుగుల లక్ష్యాన్ని 47.1 ఓవర్లలో న్యూజిలాండ్‌ ఛేదించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టేలర్‌ హాఫ్ సెంచరీ:

టేలర్‌ హాఫ్ సెంచరీ:

లక్ష్య ఛేదనలో కివీస్‌ ఓపెనర్లు గప్తిల్‌ (25), మన్రో (24)లు త్వరగానే పెవిలియన్ చేరారు. షకిబ్‌ అల్‌ హసన్‌ ఈ జోడీని ఔట్‌ చేసాడు. దీంతో 55 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్‌ విలియమ్సన్‌ (40; 72 బంతుల్లో 1×4), రాస్‌ టేలర్‌ ఆదుకున్నారు. 12వ ఓవర్లో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వీళ్లిద్దరు ఆ తర్వాత బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఇక ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో బౌండరీ బాదిన టేలర్‌.. 40 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు. ఈ క్రమంలో 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

రసవత్తర పోరులో విజయం:

విలియమ్సన్‌ (40)ను హసన్‌ పెవిలియన్‌ చేర్చగా.. లాథమ్‌ డకౌటయ్యాడు. టేలర్‌ క్రీజులో ఉండడంతో కివీస్‌ విజయంపై భరోసాగానే ఉంది. అయితే ఒత్తిడిలో పడిన టేలర్‌ ఔట్‌ కావడంతో కివీస్‌ కష్టాల్లో చిక్కుకుంది. 42 బంతుల్లో 27 పరుగులు కావాల్సిన దశలో గ్రాండ్‌హోమ్‌ (15), నీషమ్‌ (25) ఔట్‌ కావడంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. కీలక సమయంలో హెన్రీ (4) ఔట్‌ అయినా.. శాంట్నర్‌ (13 నాటౌట్‌), ఫెర్గుసన్‌ (4 నాటౌట్‌) కివీస్‌ను విజయ తీరాలకు చేర్చారు.

హెన్రీ విజృంభణ:

హెన్రీ విజృంభణ:

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌ (24), సౌమ్య సర్కార్‌ (25) తొలి వికెట్‌కు 45 పరుగులు జత చేసి శుభారంభం అందించారు. అయితే హెన్రీ, బౌల్ట్‌ విజృంభించడంతో బంగ్లా స్వల్ప వ్యవధిలో తమీమ్‌, సౌమ్య సర్కార్‌ వికెట్లు కోల్పోయింది. ముష్ఫికర్‌ రహీం (19) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేదు. దీంతో బంగ్లా 110/3తో ఇబ్బందుల్లో పడింది.

షకీబల్‌ ఒక్కడే:

షకీబల్‌ ఒక్కడే:

ఈ దశలో షకిబ్‌ అల్‌ హసన్‌, మిథున్‌ (26) తో కలిసి బంగ్లా ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 41 పరుగుల జత చేయడంతో బంగ్లా కోలుకుంది. ఈ క్రమంలోనే షకిబ్‌.. 54 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 151/3తో మెరుగైన స్థితిలో ఉన్న బంగ్లాను గ్రాండ్‌హోమ్‌ దెబ్బ తీసాడు. షకీబల్‌ను గ్రాండ్‌హోమ్‌.. మిథున్‌ను హెన్రీ పెవిలియన్‌ చేర్చాడు. ఇన్నింగ్స్ చివరలో మహ్మదుల్లా (20), సైఫుద్దీన్‌ (29; 23 బంతుల్లో 3×4, 1×6) మెరవడంతో బంగ్లా పోరాడే స్కోరు చేయగలిగింది. కివీస్‌ బౌలర్లలో హెన్రీతో 4 వికెట్లు తీసాడు.

Story first published: Thursday, June 6, 2019, 9:06 [IST]
Other articles published on Jun 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X