Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ క్రికెటర్‌ను ఓపెనింగ్‌ పంపాలని చెట్టెక్కిన అభిమాని

CWC19: Afghanistan vs Sri Lanka: Sri Lankan Fan Climbs Tree

క్రికెట్ ఆటకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ఇక ప్రతి క్రికెటర్‌కు కూడా తమ దేశంలో చాలా మంది అభిమానులు ఉంటారు. తన అభిమాన క్రికెటర్‌ పరుగులు చేస్తే సంతోషపడుతుంటారు. విఫలమయితే మాత్రం నిరుత్సహపడుతారు. తమ దేశ జట్టు ఓడిపోతే లోపాలను వెతుకుతారు. మరోవైపు ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోతారు. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్‌ చేతిలో శ్రీలంక ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమిని జీర్ణించుకోలేని ఓ అభిమాని వినూత్న నిరసన తెలిపాడు. లంక జట్టు విజయాలు సాధించాలంటే ఆల్‌రౌండ‌ర్ తిసెరా పెరీరాను ఓపెన‌ర్‌గా పంపాలని డిమాండ్ చేస్తూ.. ఓ భారీ మ‌ర్రి చెట్టు ఎక్కి నిరసన తెలిపాడు. ఈ వీడియోను శ్రీలంక మాజీ క్రికెట‌ర్, ప్రముఖ వ్యాఖ్యాత ర‌స్సెల్ అర్నాల్డ్ షేర్ చేసాడు. 'అతన్ని చెట్టు ఎక్కనివ్వండి, ఎవరూ అపకండి' అని ట్వీట్ చేసాడు.

ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రపంచకప్‌లో భాగంగా సోఫియా గార్డెన్స్ వేదికగా ఈ రోజు ఆఫ్ఘ‌నిస్తాన్‌తో శ్రీలంక మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ కెప్టెన్ గుల్బదిన్‌ నైబ్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో.. లంక బ్యాటింగ్ చేస్తోంది. లంక ఓపెనర్లు దిముత్ కరుణరత్నె (30), కుశాల్ పెరీరా (43)లు ధాటిగా ఆడుతున్నారు. 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది.

జట్టు:

శ్రీలంక:
దిముత్ కరుణరత్నె(కెప్టెన్), లాహిరు తిరుమానె, కుశాల్ పెరీరా (వికెట్ కీపర్), కుశాల్ మెండీస్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, తిసార పెరీరా, ఇసురు ఉడాన, నువాన్ ప్రదీప్, సురంగ లక్మల్, లసిత్ మలింగ.

ఆప్ఘనిస్తాన్‌:
హజ్రతుల్లా జజాయ్, మొహ్మద్ షహజద్ (వికెట్ కీపర్), రహ్మత్‌ షా, హష్మతుల్లా షాహిది, మొహమ్మద్‌ నబీ, గుల్బదిన్‌ నైబ్‌ (కెప్టెన్‌), నజీబుల్లా జద్రాన్‌ , రషీద్‌ ఖాన్, దౌలత్‌ జద్రాన్, ముజీబుర్‌ రహ్మాన్, హమీద్‌ హసన్.

Story first published: Tuesday, June 4, 2019, 17:02 [IST]
Other articles published on Jun 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+