For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒక్క సిక్స్ కొట్టడానికి 1,168 బంతులు తీసుకున్న పాకిస్తాన్: ఎట్టకేలకు..

Pakistan vs Afghanistan: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో పాకిస్తాన్ కీలక మ్యాచ్ ఆడుతోంది. తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. సెమీ ఫైనల్స్ రేసులో నిల్చోవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతోంది. చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి వేదిక.

ఈ మ్యాచ్ గెలుపోటములు బాబర్ ఆజమ్ సేన తలరాతను డిసైడ్ చేయనున్నాయి. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లను ఆడిన బాబర్ ఆజమ్ టీమ్.. రెండింట్లో నెగ్గింది. నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో కొనసాగుతోంది. సెమీ ఫైనల్స్ రేసులో నిల్చోవాలంటే ఈ మ్యాచ్‌ను గెలిచి తీరాల్సి ఉంటుంది పాకిస్తాన్‌కు.

CWC 2024, PAK vs AFG: Pakistan hit a six in the Power play after 1168ballsinODIs

ఈ పరిస్థితుల్లో టాస్ గెలిచి.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్. ఆఫ్ఘనిస్తాన్‌పై భారీ స్కోర్ సాధించడమే లక్ష్యంగా కనిపిస్తోందతని ఉద్దేశం. భారీ స్కోర్‌ సాధించడం, ఆ తరువాత ఆఫ్ఘనిస్తాన్‌ను తక్కువ పరుగుల వద్దే కట్టడి చేయాలనేది వ్యూహం. ఫలితంగా తన నెట్ రన్‌రేట్ గణనీయంగా పెంచుకోవాలనే పట్టుదలతో ఉంది పాకిస్తాన్ జట్టు.

పాకిస్తాన్ ఒకటి తలిస్తే ఆఫ్ఘనిస్తాన్ మరొకటి తలచింది. పాకిస్తాన్‌ బలహీనత మీద దెబ్బకొట్టే ప్రయత్నానికి పూనుకుంది. ఏకంగా నలుగురు క్వాలిటీ స్పిన్నర్లతో బరిలోకి దిగింది. రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్‌ను బరిలోకి దింపింది. నలుగురు స్పిన్నర్లతో పాక్ బ్యాటర్లను కట్టడి చేయాలనేది ఆఫ్ఘన్ ఉద్దేశం.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టు ధాటిగా ఆడుతోంది. ఓవర్‌కు ఆరు పరుగులు చొప్పున సాధిస్తోంది. 10 ఓవర్లల్లో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసిందా జట్టు. ఓపెనర్ అబ్దుల్లా షఫిక్- 39, టాప్ ఆర్డర్ బ్యాటర్ బాబర్ ఆజమ్- 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఈ మ్యాచ్‌లో ఎట్టకేలకు సిక్స్ కొట్టింది పాకిస్తాన్. వన్డే ఇంటర్నేషనల్స్‌లో పవర్ ప్లేలో సిక్స్ బాదడం అనేది పాకిస్తాన్‌కు అత్యంత అరుదుగా మారింది. తోటి జట్ల బ్యాటర్లు సిక్సుల మీద సిక్సులు కొడుతోంటే పాకిస్తాన్ మాత్రం చతికిలపడుతూ వచ్చింది ఇన్ని రోజులు. ఎట్టకేలకు పవర్ ప్లే ఓ సిక్స్ సాధించింది.

అయిదో ఓవర్ మూడో బంతిని సిక్స్‌గా మలిచాడు అబ్దుల్లా షఫిక్. నవీన్ ఉల్ హక్ వేసిన ఓవర్ అది. వికెట్లకు కాస్త దూరంగా పడి.. భుజాల పైకి వచ్చిన షార్ట్ బాల్‌ను ఫెన్సింగ్ దాటించాడు షఫిక్. డీప్ బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా బంతిని రాకెట్ వేగంతో తరలించాడు. అదే పవర్ ప్లేలో మరో సిక్సర్ కూడా నమోదైంది. ముజీబ్ వేసిన ఎనిమిదో ఓవర్ మూడో బంతిని మిడాఫ్ మీదుగా ఫెన్సింగ్ దాటించాడు షఫిక్.

Story first published: Monday, October 23, 2023, 15:20 [IST]
Other articles published on Oct 23, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+