Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్తాన్‌ చుట్టూ ఉచ్చు: బలహీనత మీద దెబ్బకొట్టే ప్రయత్నం..!!

Pakistan vs Afghanistan: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో పాకిస్తాన్ కీలక మ్యాచ్ ఆడుతోంది. తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. సెమీ ఫైనల్స్ రేసులో నిల్చోవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతోంది. చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి వేదిక.

ఈ మ్యాచ్ గెలుపోటములు బాబర్ ఆజమ్ సేన తలరాతను డిసైడ్ చేయనున్నాయి. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లను ఆడిన బాబర్ ఆజమ్ టీమ్.. రెండింట్లో నెగ్గింది. నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో కొనసాగుతోంది. సెమీ ఫైనల్స్ రేసులో నిల్చోవాలంటే ఈ మ్యాచ్‌ను గెలిచి తీరాల్సి ఉంటుంది పాకిస్తాన్‌కు.

 CWC 2024, PAK vs AFG: Afghanistan playing with 4 spinners against Pakista

ఈ పరిస్థితుల్లో టాస్ గెలిచి.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్. ఆఫ్ఘనిస్తాన్‌పై భారీ స్కోర్ సాధించడమే లక్ష్యంగా కనిపిస్తోందతని ఉద్దేశం. భారీ స్కోర్‌ సాధించడం, ఆ తరువాత ఆఫ్ఘనిస్తాన్‌ను తక్కువ పరుగుల వద్దే కట్టడి చేయాలనేది వ్యూహం. ఫలితంగా తన నెట్ రన్‌రేట్ గణనీయంగా పెంచుకోవాలనే పట్టుదలతో ఉంది పాకిస్తాన్ జట్టు.

ఆఫ్ఘనిస్తాన్‌పై విజయం సాధిస్తే ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంటుంది. ఇందులో ఓడిపోతే- ఇక మళ్లీ ఆ జట్టు కోలుకోవడం దాదాపుగా అసాధ్యమే అవుతుంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లలో మూడు జట్లు బలమైనవే. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లను ఢీ కొట్టాల్సి ఉంటుంది.

పాకిస్తాన్ ఒకటి తలిస్తే ఆఫ్ఘనిస్తాన్ మరొకటి తలచింది. పాకిస్తాన్‌ బలహీనత మీద దెబ్బకొట్టే ప్రయత్నానికి పూనుకుంది. ఏకంగా నలుగురు క్వాలిటీ స్పిన్నర్లతో బరిలోకి దిగింది. రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నూర్ అహ్మద్‌ను బరిలోకి దింపింది. నలుగురు స్పిన్నర్లతో పాక్ బ్యాటర్లను కట్టడి చేయాలనేది ఆఫ్ఘన్ ఉద్దేశం.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టు ఆచితూచి ఆడుతోంది. అయిదు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫిక్- 19, ఇమామ్ ఉల్ హక్- 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ అయిదు ఓవర్లలోనే మూడు బౌండరీలు, ఒక సిక్సర్ నమోదయ్యాయి.

Story first published: Monday, October 23, 2023, 14:32 [IST]
Other articles published on Oct 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+