Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీసీసీఐకి కొత్త తలనొప్పి..!!

BCCI: ఐసీసీ ప్రపంచ కప్ 2023 రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే సగం టోర్నమెంట్ ముగిసినట్టే. 25 మ్యాచ్‌లు ముగిశాయి. ఈ మధ్యాహ్నం జరగబోయేది 26వది. చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో దక్షిణాఫ్రికాతో ఢీకొట్టబోతోంది పాకిస్తాన్. ఇదో హై-ఓల్టేజ్‌ మ్యాచ్.

వరుస విజయాలతో దూసుకెళ్తోన్న దక్షిణాఫ్రికన్లకు పాకిస్తాన్ ఏ స్థాయిలో అడ్డుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది. అయిదు మ్యాచ్‌లల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది ప్రొటీస్ టీమ్. పాకిస్తాన్ పరిస్థితి దీనికి భిన్నం. అయిదు మ్యాచ్‌లల్లో రెండింటిని మాత్రమే నెగ్గింది. పాయింట్ల పట్టికలో ఆరోస్థానానికి దిగజారింది.

CWC 2023: Wall of Eden Gardens in Kolkata, collapse due to hit by an earth movingmachine

దీని తరువాత తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 31వ తేదీన ఆడుతుంది పాకిస్తాన్. బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో షెడ్యూల్ అయిన మ్యాచ్ ఇది. మలి దశలో అధికశాతం మ్యాచ్‌లన్నీ జరిగేది ఇక్కడే. శనివారం బంగ్లాదేశ్- నెదర్లాండ్స్, 31న పాకిస్తాన్- బంగ్లాదేశ్, నవంబర్ 5వ తేదీన భారత్- దక్షిణాఫ్రికా, 11వ తేదీన ఇంగ్లాండ్-పాకిస్తాన్‌ జట్లూ ఇక్కడే తారసపడనున్నాయి.

నవంబర్ 16వ తేదీన జరిగే కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్‌కు కూడా ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఆయా మ్యాచ్‌లన్నింటినీ విజయవంతం చేయడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సన్నాహాలు చేస్తోంది. ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.

ఈ పరిస్థితుల్లో బీసీసీఐకి కొత్త తలనొప్పి పుట్టుకొచ్చింది. ఈడెన్ గార్డెన్స్ గోడ కుప్పకూలింది. జేసీబీ ఢీ కొట్టడంతో స్టేడియం అవుట్ సైడ్ వాల్ ధ్వంసమైంది. స్టేడియం ఆవరణ బయట జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా బీసీసీఐ, బెంగల్ క్రికెట్ అసోసియేషన్.. జేసీబీ, ఇతర నిర్మాణ వాహనాలను వినియోగిస్తోన్నాయి. ఈ క్రమంలో జేసీబీ ఢీకొట్టడంతో గోడ కుప్పకూలింది.

గేట్ నంబర్లు 3-4 మధ్య ఉండే గోడ అది. దానికి ఆనుకునే లైటింగ్ టవర్స్ ఉండటం.. ప్రాధాన్యతను సంతరించుకుంది. గోడ కూలిన ఘటనలో లైటింగ్ టవర్స్‌కు ఎలాంటి డ్యామేజ్ కాలేదని బీసీసీఐ చెబుతోంది. యుద్ధ ప్రాతిపదికన గోడను పునర్నించే కార్యక్రమాలను చేపట్టింది. శనివారం బంగ్లాదేశ్- నెదర్లాండ్స్ మ్యాచ్‌కు ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొంది.

ఈడెన్ గార్డెన్స్ 1864లో ఈడెన్ గార్డెన్స్ స్టేడియం నిర్మితమైంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఇది. దీని కెపాసిటీ 66,00. భారత క్రికెట్ మక్కాగా పిలుస్తారు. బీసీసీఐ- బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా దీన్ని నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తోన్నాయి. ఐపీఎల్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ హోమ్ పిచ్ కూడా.

Story first published: Friday, October 27, 2023, 11:44 [IST]
Other articles published on Oct 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+