For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆపండ్రా మీ గోల- మీ వల్ల క్యాచ్ మిస్ అవుద్ది: ఫ్యాన్స్‌ను మందలించిన కోహ్లీ..!!

Virat Kohli: ఐసీసీ ప్రపంచకప్ 2023లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది టీమిండియా. వరుసగా ఎనిమిది విజయాలను సాధించింది. ఇప్పటికే సెమీ ఫైనల్స్ బెర్త్ ఖరారయినప్పటికీ తన వేగాన్ని తగ్గించట్లేదు. ఎదురొచ్చిన వాళ్లను తొక్కుకుంటూ వెళ్తోంది. ఫైనల్స్‌పై ఆశలు రేకెత్తించింది.

కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌‌లో దక్షిణాఫ్రికాను ఉతికారేసింది టీమిండియా. విరాట్ కోహ్లీ మరోసారి సెంచరీతో చెలరేగాడు. 121 బంతుల్లో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్-77, రోహిత్ శర్మ- 40 చేశారు. చివర్లో రవీంద్ర జడేజా ధాటిగా ఆడటంతో 326 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది టీమిండియా.

CWC 2023: Virat Kohli warns crowd as Bhai catch miss ho jayegaa during the match

అనంతరం బౌలర్లు డ్యూటీ ఎక్కారు. తమ తడాఖా చూపారు. బలమైన దక్షిణాఫ్రికా బ్యాటర్లను చీల్చి చెండాడారు. 83 పరుగులకే బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. ఆల్ రౌండర్ మార్కో జెన్‌సెన్ చేసిన 14 పరుగులే దక్షిణాఫ్రికా ఇన్నింగ్‌లో టాప్ స్కోర్ అంటే బౌలర్ల దాడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రవీంద్ర జడేజా అయిదు వికెట్లతో సఫారీల నడ్డి విరిచాడు.

టీమిండియా ఫీల్డింగ్ చేస్తోన్నప్పుడు ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఫీల్డింగ్ సమయంలో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు పెద్ద ఎత్తున గోల చేస్తోండటం విరాట్ కోహ్లీకి నచ్చలేదు. అతని కాన్సన్ట్రేషన్‌ను దెబ్బతీసినట్టు కనిపించింది. దీనితో అతను కాస్త చిరాకు పడ్డాడు. ఆపండ్రా మీ గోల అంటూ సంజ్ఞలు చేశాడు.

స్లిప్స్‌లో శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఫీల్డింగ్‌లో నిల్చున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. విరాట్ కోహ్లీ స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను సున్నితంగా మందలించడం కనిపించింది. వేలెత్తి చూపుతూ నవ్వుతూనే ఆడియన్స్‌ను హెచ్చరించాడు. సైలెంట్‌గా ఉండాలనీ సూచించాడు. మీ గోల వల్ల క్యాచ్ మిస్ అవుతుందనీ చెప్పాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Story first published: Monday, November 6, 2023, 11:10 [IST]
Other articles published on Nov 6, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+