For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ గురించి గూగుల్ ఏం చెబుతోంది- కొత్త అప్‌డేట్

Virat Kohli: ఐసీసీ ప్రపంచకప్ 2023.. టీమిండియా విజృంభణకు అద్దం పడుతోంది. సత్తా ఏమిటో మరోసారి క్రికెట్ ప్రపంచానికి చాటి చెబుతోంది. ఇప్పటివరకు ఓటమి అంటే తెలియని జట్టు ఏదైనా ఉందంటే అది భారతే. సగం టోర్నమెంట్ అయినపోయినప్పటికీ టీమిండియాను కొట్టే జట్టే లేదు.

ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏవీ టీమిండియా ముందు నిలవలేకపోయాయి. చివరికి న్యూజిలాండ్ సైతం భారత్ ముందు మోకరిల్లక తప్పలేదు. ఈ అయిదు విజయాలు- 10 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇంకో మ్యాచ్ గెలిస్తే- వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్ చేరిన మొట్టమొదటి జట్టు ఇదే అవుతుంది.

CWC 2023: Virat Kohli stands in the 5th place as most searched athlete onGooglein2023

జట్టు ఇంత శతృ దుర్భేధ్యంగా మారడానికి ప్రధాన కారణం.. ఆల్‌రౌండ్ పెర్‌ఫార్మెన్స్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా ఎందులోనూ తీసిపోవట్లేదు టీమిండియా. బ్యాటర్లు, బౌలర్లు పోటీ పడి రాణిస్తోన్నారు. బ్యాటర్లు స్టేడియంలో పరుగుల వరద పారిస్తోండగా.. బౌలర్లు ప్రత్యర్థిని ఎక్కడికక్కడ కట్టడి చేస్తోన్నారు.

ప్రతి మ్యాచ్‌లోనూ కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.. తమ ప్రతాపం చూపుతోన్నారు. ఈ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్లల్లో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు 354 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 311 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు దక్షిణాఫ్రికా డాషింగ్ ఓపెనర్ క్వింటన్ డికాక్. 407 పరుగులు చేశాడు డికాక్.

ఈ వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ ఆడుతోన్న తీరు గూగుల్‌పై ప్రభావం చూపింది. ఈ ఏడాది ఇప్పటివరకు మోస్ట్ సెర్చ్డ్ అథ్లెట్ల జాబితాలో కోహ్లీని నిలిపింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు గూగుల్‌లో సెర్చ్ చేసిన పేర్లల్లో విరాట్ కోహ్లీది అయిదో స్థానం. మొత్తంగా 68 మిలియన్ల మంది విరాట్ కోహ్లీ పేరును సెర్చ్ చేశారు.

ఈ జాబితాలో టాప్‌లో ఉన్నాడు క్రిస్టియానో రొనాల్డో. 199.4 మిలియన్ల మంది అతని గురించి సెర్చ్ చేశారు. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా నెయ్‌మార్ జూనియర్- 140.9, లియోనెల్ మెస్సీ- 104.4, లెబ్రాన్ జేమ్స్- 72.1 ఉన్నారు. ఆసియా దేశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు.

Story first published: Wednesday, October 25, 2023, 10:04 [IST]
Other articles published on Oct 25, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+