Rohit Sharma: ఐసీసీ ప్రపంచకప్ 2023లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది టీమిండియా. వరుసగా ఎనిమిది విజయాలను సాధించింది. ఇప్పటికే సెమీ ఫైనల్స్ బెర్త్ ఖరారయినప్పటికీ తన వేగాన్ని తగ్గించట్లేదు. ఎదురొచ్చిన వాళ్లను తొక్కుకుంటూ వెళ్తోంది. ఫైనల్స్‌పై ఆశలు రేకెత్తించింది.
కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాను ఉతికారేసింది టీమిండియా. విరాట్ కోహ్లీ మరోసారి సెంచరీతో చెలరేగాడు. 121 బంతుల్లో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్-77, రోహిత్ శర్మ- 40 చేశారు. చివర్లో రవీంద్ర జడేజా ధాటిగా ఆడటంతో 326 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది టీమిండియా.

అనంతరం బౌలర్లు డ్యూటీ ఎక్కారు. బలమైన దక్షిణాఫ్రికా బ్యాటర్లను చీల్చి చెండాడారు. 83 పరుగులకే కుప్పకూల్చారు. ఆల్ రౌండర్ మార్కో జెన్‌సెన్ చేసిన 14 పరుగులే దక్షిణాఫ్రికా ఇన్నింగ్‌లో టాప్ స్కోర్ అంటే మన బౌలర్ల దాడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ రెండు జట్లూ సెమీ ఫైనల్స్ చేరుకున్నందు వల్ల ఈ గెలుపోటములు పెద్దగా ప్రాధాన్యతలోకి రావట్లేదు.
ఈ వరుస విజయాల్లో కెేప్టెన్‌గా, జట్టు ఓపెనర్‌గా కీలక పాత్రను పోషిస్తోన్నాడు రోహిత్ శర్మ. దక్షిణాఫ్రికా, ఇదివరకు శ్రీలంకను వంద పరుగులు కూడా దాటనివ్వలేదు. బ్యాటర్‌గా భారీ స్కోర్లు చేస్తూనే.. సమయానుకూలంగా బౌలర్లను మార్చ గలుగుతున్నాడు. స్పిన్నర్లు సమర్థవంతంగా వినియోగించుకుంటోన్నాడు.
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్.. దీన్ని ప్రశంసించాడు. రోహిత్ శర్మను నిఖార్సయిన కేప్టెన్‌గా అభివర్ణించాడు. బ్యాటర్‌గా, కేప్టెన్‌గా సత్తా చాటుతున్నాడని, ఇలాంటి ప్లేయర్ అరుదుగా వస్తుంటారని కితాబిచ్చాడు. రోహిత్ శర్మ వంటి కేప్టెన్ సారథ్యంలో టీమిండియా వరల్డ్ కప్ ఆడబోతోండటం అదృష్టంగా పేర్కొన్నాడు.
జట్టులో మిగిలిన ప్లేయర్లకు ఆడటానిని అవకాశాలను ఇస్తోండటం రోహిత్ శర్మ గొప్పతనమని షోయబ్ అఖ్తర్ చెప్పాడు. మిగిలిన వారికి అవకాశాలను ఇచ్చే క్రమంలో ఒక్క ఈ వరల్డ్ కప్‌లోనే కనీసం అయిదు సెంచరీలను అతను మిస్ చేసుకున్నాడని వ్యాఖ్యానించాడు. స్వార్థం అనేది లేకుండా ఆడుతున్నాడని, సెల్ఫ్ లెస్ ప్లేయర్ అని చెప్పుకొచ్చాడు.