Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్ నుంచి జట్టు కేప్టెన్ అవుట్- శాపాలు తగిలాయేమో..!!

Shakib Al Hasan: ఇస్లామాబాద్: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భాగంగా మరో ఆసక్తికరమైన పోరు నడుస్తోంది. ఆస్ట్రేలియాతో ఆఫ్ఘనిస్తాన్ తలపడుతోంది. ముంబైలోని వాంఖెడే స్టేడియం దీనికి వేదిక. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘన్. తొలి ఎనిమిది ఓవర్లల్లో ఒక వికెట్ నష్టానికి 38 పరుగులు చేసింది.

శ్రీలంకతో సోమవారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.3 ఓవర్లల్లో 279 పరుగులకు ఆలౌట్ కాగా.. 41.1 ఓవర్లలోనే ఏడు వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ ఈ లక్ష్యాన్ని ఛేదించింది.

CWC 2023: Shakib Al Hasan has been ruled out of the remainders of ICCWorldCup2023

ఈ మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్.. కెేప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. ఆల్ రౌండర్ ప్రతిభను ప్రదర్శించాడు. 65 బంతుల్లో రెండు భారీ సిక్సర్లు, 12 ఫోర్లతో 82 పరుగులు చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు బౌలింగ్‌లో రెండు కీలక వికెట్లను నేలకూల్చాడు. సదీర విక్రమతో పాటు సెంచరీ హీరో చరిత్ అసలంకను వెనక్కి పంపాడు.

ఈ మ్యాచ్‌లో షకీబ్ వేలి గాయంతోనే ఆడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో బంతి అతని ఎడమచేతి వేలిని బలంగా తాకింది. ఆ నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ కొనసాగించాడు. ఆ తరువాత ఆ గాయం మరింత తీవ్రమైంది. ఎడమ అరచేయ్యిలో వాపు కనిపించింది.

దీనిపై ఎక్స్‌రే తీయించగా.. చూపుడు వేలిలో ఫ్రాక్చర్ ఏర్పడినట్లు తేలింది. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ జట్టు ఫిజియో బైజెదుల్ ఇస్లాం ఖాన్ ధృవీకరించారు. ఎక్స్‌రే తీసి చూడగా.. ఎడమ చెయ్యి చూపుడు వేలిలో ఫ్రాక్చర్ కనిపించిందని, దీనితో అతనికి విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు తెలిపారు. దీనితో ఈ టోర్నమెంట్ నుంచి షకీబ్ తప్పుకొన్నాడు.

ఈ వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ సెమీ ఫైనల్స్ రేసులో లేదు. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లల్లో ఆరింట్లో ఓడింది. రెండు మ్యాచ్‌లల్లో గెలిచి నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఇక ఆ జట్టు తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 11వ తేదీన ఆడబోతోంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆస్ట్రేలియాను ఢీ కొట్టాల్సి ఉంది.

Story first published: Tuesday, November 7, 2023, 14:56 [IST]
Other articles published on Nov 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+