Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Viral video: దెయ్యాలతో పాకిస్తాన్ బ్యాటర్ చిట్ చాట్- వీడియోలో రికార్డ్..?!

చెన్నై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో వరుస సంచలనాలు నమోదవుతున్నాయి. ఛాంపియన్ రేసులో నిలిచిన కొమ్ములు తిరిగిన మేటి జట్లు మట్టి కరుస్తున్నాయి. బోణి చేయడమే కష్టమనుకుంటోన్న చిన్న జట్లు పంజా విసురుతున్నాయి. ఇప్పటికే మూడుసార్లు ఇది రుజువైందీ మెగా క్రికెట్ ఈవెంట్‌లో.

మొన్నటికి మొన్న ప్రస్తుత ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది ఆఫ్ఘనిస్తాన్. ఏకంగా 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అదే దూకుడును కంటిన్యూ చేస్తోందా జట్టు. ఆఫ్ఘనిస్తాన్ ప్రతాపానికి ఈ సారి పాకిస్తాన్ బలి అయింది. అంతకుముందు- నెదర్లాండ్స్ జట్టు దక్షిణాఫ్రికాపై జయకేతనాన్ని ఎగురవేసింది.

CWC 2023: Pakistan player Iftikhar Ahmeds viral video baffles social media

చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది ఆఫ్ఘనిస్తాన్. ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్ పెట్టిన 282 పరుగుల టార్గెట్‌ను రెండంటే రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి కొట్టిపడేసింది ఆఫ్ఘన్.

పాకిస్తాన్ జట్టు భారీ స్కోర్ చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది. ఓపెనర్ అబ్దుల్లా షఫిక్- 58, కేప్టెన్ బాబర్ ఆజమ్- 74, షాదబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్ 40 చొప్పున పరుగులు చేశారు. బ్యాటర్లు రాణించినప్పటికీ.. బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. 49 ఓవర్లల్లో ఇద్దరిని మాత్రమే పెవిలియన్ పంపించగలిగారు. షహీన్ షా అఫ్రిది, హసన్ అలీ మాత్రమే ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు ఇబ్రహీం జద్రాన్- 87, రహ్మతుల్లా గుర్బాజ్- 65 పరుగులతో తొలి వికెట్ నష్టానికి 130 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పుడే మ్యాచ్ వారి వశం అయింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు రహ్మత్ షా- 77, కేప్టెన్ హష్మతుల్లా షహీదీ- 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ చవి చూసిన మూడో ఓటమి ఇది. వరుసగా మూడింట్లో ఓడిందా జట్టు.

ఈ మ్యాచ్ సందర్భంగా రికార్డయిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్తాన్ బ్యాటర్ ఇఫ్తికర్ అహ్మద్‌‌కు సంబంధించిన వీడియో అది. పాకిస్తాన్ స్పీడ్ స్టర్ షహీన్ షా అఫ్రిది, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కూడా ఈ వీడియోలో కనిపించారు. షాదబ్ ఖాన్‌తో షహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్.. మాట్లాడుకుంటూ రావడం ఇందులో రికార్డయింది.

వారిద్దరి వెనుకే ఉన్న ఇఫ్తికర్ అహ్మద్ మాత్రం బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా తనతో తాను గట్టి గట్టిగా మాట్లాడుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు. షహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్‌తో అతను మాట్లాడుతున్నట్లు కూడా లేదు. వారిద్దరు ముందు వెళ్తోండగా.. ఇఫ్తికర్ మాత్రం వెనుక రావడం కనిపించింది. ఆ సమయంలో అతను ఎవరినో బెదిరిస్తోన్నట్లూ అనిపించింది.

నిజానికి- గ్రౌండ్‌లో ప్లేయర్లెవరూ ఇయర్ బడ్స్ వాడటానికి అనుమతి లేదు. ఇంటర్వ్యూలు ఇస్తూ మ్యాచ్‌లు ఆడిన సందర్భాలు ఉన్నప్పటికీ.. అలాంటివి ఎక్కువగా ద్వైపాక్షిక సిరీస్‌లు లేదా ఐపీఎల్ వంటి టోర్నమెంట్లల్లో ఉంటాయి. ఐసీసీ వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌లల్లో ప్లేయర్లు ఇలా మధ్యలో మాట్లాడే అనుమతి లేదు.

అయినప్పటికీ- ఇఫ్తికర్ అహ్మద్ మాత్రం ఇలా ఎవరితోనో మాట్లాడటం కనిపించింది. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఆత్మలు, దెయ్యాలతో మాట్లాడుతున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి అతని మీద. ఆ ఇన్విజిబుల్ పర్సన్ ఎవరు? అంటూ ఆరా తీయడం మొదలెట్టారు నెటిజన్లు.

Story first published: Wednesday, October 25, 2023, 13:28 [IST]
Other articles published on Oct 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+