Pak vs SA: పాక్ నడ్డి విరిచిన షంసీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ 271
ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య చెన్నైలో మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 46.4 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దక్షిణాఫ్రికా స్పిన్ మాయాజాలానికి పాకిస్తాన్ దాసోహమైంది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (9) ఇమామ్ ఉల్ హక్ (12) పరుగులు చేసి యాన్‌సేన్ బౌలింగ్ లో ఔటయ్యారు. మంచి ఫామ్‌లో ఉన్న రిజ్వాన్ 31 పరుగులు చేసి పెవీలియన్‌కు చేరాడు. ఈ సమయంలో కెప్టెన్ బాబర్ ఆజామ్ అర్థ సెంచరీ చేసి ఇన్నింగ్స్‌ను చక్కబెట్టే ప్రయత్నం చేశాడు.
పాకిస్తాన్ స్కోరు 141 పరుగుల వద్ద బాబర్ ఆజాం ఐదవ వికెట్‌గా వెనుదిరగడంతో పాకిస్తాన్‌కు కష్టాలు ప్రారంభమయ్యాయి. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ షకీల్ (52) షాదాబ్ ఖాన్ (43) పరుగులు చేసి పాకిస్తాన్‌కు గౌరవ ప్రదమైన స్కోరును అందించారు. వీరిద్దరి భాగస్వామ్యం బలపడుతుందనుకుంటున్న సమయంలో కోట్జీ షాదాబ్ ఖాన్‌ను బోల్తా కొట్టించాడు. 225 స్కోరు వద్ద వీరి భాగస్వామ్యంకు తెరపడింది. ఆ తర్వాత మరో 34 పరుగులు చేశాక అంటే స్కోరు 259 వద్ద షకీల్‌ను షంసీ ఔట్ చేశాడు.
]

ఇక చివర్లో మొహ్మద్ నవజ్ బ్యాట్‌ను ఝుళిపించడంతో 24 పరుగులు చేశాడు. షహీన్‌షా ఆఫ్రిదీ, మొహ్మద్ వసీంలు వెంటనే ఔట్ అవడంతో పాక్ ఇన్నింగ్స్ 46.4 ఓవర్లలో 270 పరుగుల వద్ద తెరపడింది. అంతకుముందు టాస్ గెలిచి పాకిస్తాన్ బ్యాటింగ్‌కు దిగింది. ఇక దక్షిణాఫ్రికా బౌలింగ్ విభాగానికి వస్తే తబ్రైజ్ షంసీ నాలుగు వికెట్లు పడగొట్టగా, మార్కో యాన్‌సేన్ 3 వికెట్లు తీశాడు. గెరాల్డ్ కోట్జీ 2 వికెట్లు, ఎంగిడీ ఒక వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications