For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంటికెళ్లంగానే ఫస్ట్ ఆ పని చేయండి- పాకిస్తాన్‌ జట్టుకు గంభీర్ సలహా

Babar Azam: ఐసీసీ ప్రపంచకప్ 2023లో దక్షిణాఫ్రికా దండయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లల్లో ఆరింట్లో నెగ్గింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా దూకుడు ధాటికి భారత్ సైతం తన స్థానాన్ని కోల్పోక తప్పలేదు. ప్రొటీస్ ఖాతాలో ఒక ఓటమి ఉన్నప్పటికీ.. నెట్ రన్‌రేట్ టీమిండియా కంటే ఎక్కువే.

ఈ ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ కథ దాదాపుగా ముగిసినట్టే. దక్షిణాఫ్రికాపై ఓటమితో ఆ జట్టు సెమీ ఫైనల్స్ ఆశలు అడుగంటాయి. ఇంకా ఆ జట్టు చేతిలో మూడు మ్యాచ్‌లు మిగిలే ఉన్నప్పటికీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ జట్టు గెలవడం అసాధ్యమే కావొచ్చు. తన తదుపరి మ్యాచ్‌లల్లో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌తో ఢీ కొట్టాల్సి ఉంది.

CWC 2023, PAK vs SA: Pakistan needs to focus on their fitness, says Gautam Gambhir

సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మూడింట్లోనూ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. డు ఆర్ డై మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో మట్టికరిచింది పాకిస్తాన్. ఇందులో గెలిస్తేనే ఆ జట్టు సెమీ ఫైనల్స్ చేరడానికి కొద్దో, గొప్పో అవకాశాలు ఉండేవి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్.. 46.4 ఓవర్లల్లో 270 పరుగులకు ఆలౌట్ అయింది.

కేప్టెన్ బాబర్ ఆజమ్- 50, సవూద్ షకీల్- 52, షాదబ్ ఖాన్- 43 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా.. ఒక వికెట్ తేడాతో ఘన విజయం సాధించింది. 47.2 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. 260 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయిన తరువాత మ్యాచ్ పాకిస్తాన్ వైపు మొగ్గు చూపినప్పటికీ- లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కేశవ్ మహరాజ్, తబ్రేజ్ షాంసీ.. జాగ్రత్తగా ఆడారు. మరో వికెట్ పడకుండా జట్టును విజయ తీరాలకు చేర్చారు.

ఈ వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ వరుసగా చవి చూసిన నాలుగో ఓటమి ఇది. ఇక కోలుకోవడం కష్టమే. ఈ వరుస ఓటములపై టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఆ జట్టుకు కొన్ని సలహాలను ఇచ్చాడు. ప్రధానంగా పాకిస్తాన్ జట్టు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.

CWC 2023, PAK vs SA: Pakistan needs to focus on their fitness, says Gautam Gambhir

ప్రపంచ కప్ ముగిసిన తరువాత ఆ జట్టు స్వదేశానికి వెళ్లినప్పుడు చెయ్యాల్సిన మొట్టమొదటి పని అదేనని వ్యాఖ్యానించాడు. ఫిట్‌నెస్ మెరుగుపర్చుకుంటే తప్ప పాకిస్తాన్ జట్టు ఆటతీరు మళ్లీ గాడిన పడకపోవచ్చని తేల్చి చెప్పాడు. వరల్డ్ కప్ ఆడుతోన్న మిగిలిన తొమ్మిది జట్లు- పాకిస్తాన్ జట్టు ఫీల్డింగ్ మధ్య చాలా తేడాలు ఉన్నాయని వివరించారు.

జట్టు విజయంలో కీలక పాత్ర పోషించేది ఫీల్డింగేనని తాను బలంగా నమ్ముతానని గంభీర్ చెప్పుకొచ్చాడు. బ్యాటింగ్, బౌలింగ్ ఒక ఎత్తయితే ఫీల్డింగ్ ఒక్కటే ఇంకో ఎత్తుగా అభివర్ణించారాయన. వరల్డ్ కప్ వంటి అత్యున్నత టోర్నమెంట్లల్లో ఆడుతున్నప్పుడు ప్లేయర్లు శారీరకంగా బలంగా ఉండాలని, పాక్ జట్టులో అది లోపించిందని పేర్కొన్నాడు.

Story first published: Saturday, October 28, 2023, 11:29 [IST]
Other articles published on Oct 28, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+