For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షహీన్ షా అఫ్రిది.. ఆ స్పీడేంట్రా బాబు: 51 మ్యాచ్‌లల్లోనే..!!

Babar Azam: ఐసీసీ ప్రపంచకప్ 2023లో రసవత్తరంగా సాగుతోంది. భారత్ దూకుడు కంటిన్యూ అవుతోంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక తన తదుపరి మ్యాచ్‌ను నవంబర్ 2వ తేదీన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఆడబోతోంది. శ్రీలంకను ఢీకొట్టబోతోంది.

దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది పాకిస్తాన్. ఏడు సంవత్సరాల తరువాత భారత గడ్డపై అడుగుపెట్టిన ఈ జట్టు తన స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించట్లేదు. నాసిరకం ఆటతో నవ్వులపాలవుతోంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లల్లో పాకిస్తాన్ గెలిచింది రెండంటే రెండే. రెండు విజయాలు- నాలుగు పాయింట్లకే పరిమితమైంది ప్రస్తుతానికి. పాయింట్ల పట్టికలో ఈ జట్టు స్థానం.. ఏడు.

CWC 2023, PAK vs BAN: Shaheen Afridi becomes the fastest pacer to 100 ODI wickets

వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్స్ చేరాలంటే మిగిలిన మ్యాచ్‌లన్నింటినీ భారీ తేడాతో నెగ్గాల్సి ఉంటుంది బాబర్ ఆజమ్ సేనకు. ఈ పరిస్థితుల్లో కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. టాస్ ఓడిపోయి తొలుత ఫీల్డింగ్‌కు దిగిన పాకిస్తాన్.. బంగ్లాను బెంబేలెత్తిస్తోంది. ప్రారంభం నుంచే వికెట్లను పడగొడుతున్నారు ఆ జట్టు బౌలర్లు.

14 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది బంగ్లాదేశ్. ఓపెనర్ తన్జీద్ హసన్ డకౌట్ అయ్యాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు టపటపామంటూ రాలిపోయారు. నాజ్ముల్ హొస్సేన్ శాంటో- 4, ముష్ఫికుర్ రెహ్మాన్- 5 పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టారు. 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో మరో ఓపెనర్ లిట్టన్ దాస్, మహ్మదుల్లా జట్టును ఆదుకున్నారు. వారిద్దరూ క్రీజ్‌లో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో షహీన్ షా అఫ్రిది రెచ్చిపోయాడు. తన్జీద్ హసన్, నాజ్ముల్ శాంటో వికెట్లను పడగొట్టాడు. ఈ రెండు వికెట్లతో ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. వన్డేల్లో అతివేగంగా 100 వికెట్ల మైలురాయిని అందుకున్న బౌలర్‌గా ఆవిర్శించాడు. 51 మ్యాచ్‌లల్లో 100 వికెట్లను తీసుకున్నాడీ స్పీడ్ స్టర్.

ఇప్పటివరకు ఈ రికార్డ్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిఛెల్ స్టార్క్ పేరు మీద ఉంది. 52 మ్యాచ్‌లల్లో స్టార్క్ 100 వికెట్లను అందుకున్నాడు. దీన్ని తుడిచిపెట్టాడు షహీన్ షా.100, ఆపై వికెట్లను పడగొట్టిన పాకిస్తాన్ బౌలర్లలో అతని నంబర్ 21. 25 టెస్టుల్లో 105, 52 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 64 వికెట్లు నేలకూల్చాడు.

Story first published: Tuesday, October 31, 2023, 15:29 [IST]
Other articles published on Oct 31, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+