Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కేన్ మామ రిటర్న్..!!

Kane Williamson: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో రెండు దిగ్గజ జట్లు తలపడనున్నాయి. వరుస విజయాలను అందుకుంటూ సెమీ ఫైనల్స్ బెర్త్‌ను దాదాపు కన్‌ఫర్మ్ చేసుకున్న జట్లు అవి. ప్రస్తుతం ఈ రెండూ కూడా పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాలో కొనసాగుతున్నాయి.

అవే దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్. బుధవారం ఈ రెండింటి మధ్య పోరు ఉండబోతోంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. న్యూజిలాండ్‌కు గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. తన వరుస పరాజయాలకు పుల్ స్టాప్ పెట్టాలంటే దక్షిణాఫ్రికన్లను ఓడించక తప్పదు.

CWC 2023, NZ vs SA: Kane Williamson set play the match against South Africa

ఇప్పటికే వరుసగా రెండింట్లో ఓడింది న్యూజిలాండ్. భారత్, ఆస్ట్రేలియాపై పరాజయానలను చవి చూసింది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే దశకు చేరుకుంది. దక్షిణాఫ్రికాపైనా కూడా ఓటమి ఎదురైతే- సెమీ ఫైనల్స్ రేసు కోసం కష్టపడాల్సి ఉంటుంది బ్లాక్ క్యాప్స్‌కు. ఆ పరిస్థితి రాకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది.

ఈ మ్యాచ్‌కు న్యూజిలాండ్ కేప్టెన్ కేన్ విలియమ్సన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గాయం వల్ల ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉంటోన్నాడు కేన్ మామ. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సమయంలో బొటన వేలి గాయంతో జట్టుకు దూరం అయ్యాడు. ఫీల్డర్‌ విసిరిన త్రో అతని ఎడమ చేతి బొటన వేలిని బలంగా తాకింది. 78 పరుగుల వద్ద కేన్‌ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.

ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్టే కనిపిస్తోన్నాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ నాటికి జట్టుకు అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది. దీనిపై టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది మంగళవారం తేలిపోతుంది. కేన్ అందుబాటులోకి వస్తే బ్యాటింగ్ మరింత బలోపేతమౌతుందనే అంచనాలు ఉన్నాయి.

Story first published: Monday, October 30, 2023, 15:14 [IST]
Other articles published on Oct 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+