Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rachin Ravindra.. ఏం ఆడుతున్నాడ్రా..!!

బెంగళూరు: ఐసీసీ ప్రపంచకప్ 2023 టోర్నమెంట్‌లో భాగంగా పాకిస్తాన్‌తో న్యూజిలాండ్ తలపడబోతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక. ఈ రెండు జట్లకూ ఇది కీలకమైనదే.. న్యూజిలాండ్‌కు మరింత. గెలిచి తీరాల్సిన గేమ్ ఇది. టోర్నమెంట్ ఆరంభంలో వరుస విజయాలను సాధిస్తూ ఆ తరువాత చతికిలపడ్డ బ్లాక్ క్యాప్స్.. తమ సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలంటే ఇదొక్కటీ గెలిస్తే చాలు.

తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది పాకిస్తాన్. న్యూజిలాండ్ శుభారంభం చేసింది. 30 ఓవర్లల్లో ఒక వికెట్ నష్టానికి 211 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 39 బంతుల్లో ఆరు ఫోర్లతో 35 పరుగులు చేశాడు కాన్వే. కేప్టెన్ కేన్ విలియమ్సన్- 71, రచిన్ రవీంద్ర- 88 పరుగులతో క్రీజ్‌లో నిలిచారు.

CWC 2023, NZ vs PAK: Rachin Ravindra joined Martin Crowe and Scott Styris club

మరోసారి భారీ స్కోర్ మీద కన్నేసినట్టే కనిపిస్తోంది న్యూజిలాండ్. ఓవర్‌కు సగటున ఆరు పరుగులు చొప్పున రాబట్టుకుంటోంది. సెంచరీల మీద సెంచరీలు కొడుతున్న రచిన్ రవీంద్ర క్రీజ్‌లో ఉన్నాడు. హాఫ్ సెంచరీకి చేరువ అయ్యాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో కేన్ విలియమ్సన్ అతనికి సహకారం అందిస్తోన్నాడు. స్టైక్‌ను రొటేట్ చేస్తోన్నారీ ఇద్దరు బ్యాటర్లు.

ఈ మ్యాచ్‌లోనూ రెచ్చిపోయి ఆడుతున్నాడు రచిన్ రవీంద్ర. హాఫ్ సెంచరీని అందుకున్నాడు. 30 ఓవర్లు ముగిసేసమయానికి 88 పరుగుల మీద నిలిచాడు. 79 బంతుల్లో డజను బౌండరీలు, ఒక భారీ సిక్సర్ అతని ఇన్నింగ్‌లో నమోదయ్యాయి. మరో సెంచరీ అతని ఖాతాలో పడటానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.

ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రచిన్ రవీంద్ర ఓ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. న్యూజిలాండ్ లెజెండరీ ప్లేయర్ల జాబితాలో చేరాడు. ఒకే వరల్డ్ కప్‌లో అత్యధికంగా అర్ధసెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో చేరాడు. ఒకే వరల్డ్ కప్‌లో అయిదు హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో ప్రస్తుతం మార్టిన్ క్రో, స్కాట్ స్టైరిస్ ఉన్నారు.

1992 వరల్డ్ కప్‌లో మార్టిన్ క్రో, 2007లో స్టాట్ స్టైరిస్ అయిదు చొప్పున అర్ధసెంచరీలు నమోదు చేశారు. ఇప్పుడు వారి సరసన చేరాడు రచిన్ రవీంద్ర. ఈ ప్రపంచకప్‌లో అయిదు హాఫ్ సెంచరీలు చేశాడు. దీన్ని సెంచరీగా మార్చడం ఖాయంగా కనిపిస్తోంది.

Story first published: Saturday, November 4, 2023, 13:05 [IST]
Other articles published on Nov 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+