Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

న్యూజిలాండ్‌కు బిగ్ షాక్: వరల్డ్ కప్ టోర్నీ నుంచి కీలక ప్లేయర్ అవుట్

Matt Henry: ఐసీసీ ప్రపంచకప్ 2023 (ICC World Cup 2023) లో టీమిండియా జైత్రయాత్ర.. బ్రేకుల్లేని బండిలా సాగుతోంది. మరో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. సెమీ ఫైనల్స్‌లో తన స్థానాన్ని ఖరార్ చేసుకుంది. ఈ టోర్నమెంట్‌ సెమీస్‌లో అడుగుపెట్టిన మొట్టమొదటి జట్టుగా తన పేరును లిఖించుకుంది.

గురువారం రాత్రి తనకు బగా అచ్చొచ్చిన ముంబై వాంఖెడే స్టేడియంలో శ్రీలంకను చిత్తుచిత్తుగా ఓడించింది రోహిత్ సేన. ఏకంగా 302 పరుగుల తేడాతో విజయదుందుభిని మోగించింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకను 55 పరుగులకే కుప్పకూల్చింది.

CWC 2023, NZ vs PAK: Kyle Jamieson has been confirmed as a replacement for injured Matt Henry

టీమిండియాకు గట్టిపోటీ ఇస్తోందని భావిస్తోన్న న్యూజిలాండ్ (New Zealand) పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. వరుస పరాజయాలు బ్లాక్ క్యాప్స్‌ను వెంటాడుతోన్నాయి. ఆందోళనకరంగా మారిందా జట్టు పరిస్థితి. సెమీ ఫైనల్స్ రేసులో నిల్చోవాలంటే ఒకట్రెండు మ్యాచ్‌లను ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన స్థితిలో పడింది.

ఈ నేపథ్యంలో- న్యూజిలాండ్ స్టార్ బౌలర్ మ్యాట్ హెన్రీ (Matt Henry) జట్టుకు దూరం అయ్యాడు. గాయం వల్ల మొత్తం ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ నుంచే వైదొలిగాడు. హార్మ్ స్ట్రింగ్ ఇంజ్యురీ (Harmstring injury)కి గురయ్యాడు. ఇప్పట్లో కోలుకునే అవకాశం లేకపోవడంతో టోర్నమెంట్ నుంచే తప్పుకోవాల్సి వచ్చిందతనికి.

మ్యాట్ హెన్రీ స్థానంలో కైలె జెమిసన్ (Kyle Jemison)ను జట్టులోకి తీసుకుంది న్యూజిలాండ్. జెమిసన్ పేరును కొద్దిసేపటి కిందటే ఖరారు చేసింది. వరల్డ్ కప్‌లో మిగిలిన మ్యాచ్‌లల్లో మ్యాట్ హెన్రీకి బదులుగా కైలె జెమిసన్ ఆడతాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ వెల్లడించింది. హెన్రీ త్వరలోనే కోలుకుంటాడంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లను ఆడింది న్యూజిలాండ్. తొలి నాలుగు మ్యాచ్‌లల్లో విజయదుందుభి మోగించింది. ఆపై వరుస పరాజయాలను చవి చూస్తూ వస్తోంది. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓటమి చవి చూసింది. ఇక తన తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఎదుర్కొనబోతోంది.

న్యూజిలాండ్- పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలుస్తుంది. ప్రస్తుతం ఈ రెండు జట్లు ఎనిమిది పాయింట్లతో సమానంగా ఉన్నాయి. న్యూజిలాండ్ నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో నాలుగో స్థానాలో కొనసాగుతోంది. పాకిస్తాన్‌పై గెలిస్తే సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోగలగుతుంది కివీస్.

Story first published: Friday, November 3, 2023, 12:20 [IST]
Other articles published on Nov 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+