Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్తాన్ క్రికెటర్ ఘనత.. బెంగళూరు గడ్డపై

బెంగళూరు: ఐసీసీ ప్రపంచకప్ 2023 టోర్నమెంట్‌లో భాగంగా పాకిస్తాన్‌తో న్యూజిలాండ్ తలపడబోతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక. ఈ రెండు జట్లకూ ఇది కీలకమైనదే.. న్యూజిలాండ్‌కు మరింత. గెలిచి తీరాల్సిన గేమ్ ఇది. టోర్నమెంట్ ఆరంభంలో వరుస విజయాలను సాధిస్తూ ఆ తరువాత చతికిలపడ్డ బ్లాక్ క్యాప్స్.. తమ సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలంటే ఇదొక్కటీ గెలిస్తే చాలు.

తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది పాకిస్తాన్. న్యూజిలాండ్ శుభారంభం చేసింది. 19 ఓవర్లల్లో ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 39 బంతుల్లో ఆరు ఫోర్లతో 35 పరుగులు చేశాడు కాన్వే. కేప్టెన్ కేన్ విలియమ్సన్- 25, రచిన్ రవీంద్ర- 47 పరుగులతో క్రీజ్‌లో నిలిచారు.

 CWC 2023, NZ vs PAK: 100 ODI wickets for Pakistan pacer Hasan Ali as he tookDevonConway

మరోసారి భారీ స్కోర్ మీద కన్నేసినట్టే కనిపిస్తోంది న్యూజిలాండ్. ఓవర్‌కు సగటున ఆరు పరుగులు చొప్పున రాబట్టుకుంటోంది. సెంచరీల మీద సెంచరీలు కొడుతున్న రచిన్ రవీంద్ర క్రీజ్‌లో ఉన్నాడు. హాఫ్ సెంచరీకి చేరువ అయ్యాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో కేన్ విలియమ్సన్ అతనికి సహకారం అందిస్తోన్నాడు. స్టైక్‌ను రొటేట్ చేస్తోన్నారీ ఇద్దరు బ్యాటర్లు.

డెవాన్ కాన్వే వికెట్‌ను తీసుకోవడంతో పాకిస్తాన్ పేస్ బౌలర్ హసన్ అలీ.. కొత్త మైలురాయిని అందుకున్నట్టయింది. ఇది అతని వందో వన్డే ఇంటర్నేషనల్ వికెట్. కాన్వేను అవుట్ చేయడంతో అతను ఈ క్లబ్‌లో చేరాడు. 11వ ఓవర్ అయిదో బంతికి కాన్వేను పెవిలియన్ దారి పట్టించాడు.

 CWC 2023, NZ vs PAK: 100 ODI wickets for Pakistan pacer Hasan Ali as he tookDevonConway

హసన్ అలీ సంధించిన షార్ట్ డెలివరీని హుక షాట్ ఆడటానికి ప్రయత్నించాడు డెవాన్ కాన్వే. టైమింగ్ మిస్ అయ్యాడు. భుజాలపైకి వచ్చిన ఆ బంతి గ్లోవ్స్‌ను ముద్దాడుతూ వెళ్లి వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ చేతుల్లో వాలింది. దీనితో 29 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది న్యూజిలాండ్.

Story first published: Saturday, November 4, 2023, 12:14 [IST]
Other articles published on Nov 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+