Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బర్త్‌డే రోజు సెంచరీ చేసిన లిస్ట్‌లో కోహ్లీ ఒక్కడే అనుకుంటే పొరపాటే..

Virat Kohli: ఐసీసీ ప్రపంచకప్ 2023లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది టీమిండియా. వరుసగా ఎనిమిది విజయాలను సాధించింది. ఇప్పటికే సెమీ ఫైనల్స్ బెర్త్ ఖరారయినప్పటికీ తన వేగాన్ని తగ్గించట్లేదు. ఎదురొచ్చిన వాళ్లను తొక్కుకుంటూ వెళ్తోంది. ఫైనల్స్‌పై ఆశలు రేకెత్తించింది.

కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌‌లో దక్షిణాఫ్రికాను ఉతికారేసింది టీమిండియా. విరాట్ కోహ్లీ మరోసారి సెంచరీతో చెలరేగాడు. 121 బంతుల్లో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇది అతని 49వ సెంచరీ. శ్రేయాస్ అయ్యర్-77, రోహిత్ శర్మ- 40 చేశారు. చివర్లో రవీంద్ర జడేజా ధాటిగా ఆడటంతో 326 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది టీమిండియా.

CWC 2023: Not only Virat Kohli, this batter also hitting century on his birthday inWorldCup2023

అనంతరం బౌలర్లు తమ తడాఖా చూపారు. బలమైన దక్షిణాఫ్రికా బ్యాటర్లను చీల్చి చెండాడారు. 83 పరుగులకే బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. ఆల్ రౌండర్ మార్కో జెన్‌సెన్ చేసిన 14 పరుగులే దక్షిణాఫ్రికా ఇన్నింగ్‌లో టాప్ స్కోర్ అంటే బౌలర్ల దాడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రవీంద్ర జడేజా అయిదు వికెట్లతో సఫారీల నడ్డి విరిచాడు.

ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ.. లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ రికార్డును సమం చేశాడు.. అది కూడా తన పుట్టినరోజు నాడే. బర్త్‌డే రోజే సెంచరీ మార్క్‌ను అందుకోవడం అనేది ఓ చిరస్మరణీయ ఘట్టం అనడంలో సందేహాలు అక్కర్లేదు. తన 35వ జన్మదినం నాడు చేసిన నూటొక్క పరుగులు అతని కేరీర్‌లో అలాగే నిలిచిపోతుంది.

బర్త్ డే రోజు సెంచరీని బాదిన బ్యాటర్లల్లో కోహ్లీ ఒక్కడే ఉన్నాడనుకుంటే పొరపాటే. మరో బ్యాటర్ కూడా తన పుట్టినరోజు నాడు సెంచరీని ఊది అవతల పడేశాడు. అది కూడా ఈ 2023 వరల్డ్ కప్‌లోనే. 121 పరుగులు చేశాడా బ్యాటర్. తన పుట్టినరోజును కోహ్లీలాగే చిరస్మరణీయంగా మార్చుకున్నాడు.

అతనే- మిఛెల్ మార్ష్. ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్. అతని జన్మదినం అక్టోబర్ 20. ఈ వరల్డ్ కప్‌లో అదే రోజున సెంచరీ కొట్టాడు. పాకిస్తాన్‌పై బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 121 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌ను 62 పరుగుల తేడాతో గెలుచుకుంది ఆస్ట్రేలియా. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా 163 పరుగులతో చెలరేగాడు.

Story first published: Monday, November 6, 2023, 13:11 [IST]
Other articles published on Nov 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+