Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్ నుంచి తప్పుకోనున్న.. రోహిత్ ,కోహ్లీ ? న్యూజిలాండ్‌ మ్యాచ్ తరువాత!

ఇండియా vsన్యూజిలాండ్‌: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టుగా నిలిచారు బ్లాక్ క్యాప్స్. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించారు. న్యూజిలాండ్ తరువాత భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. నాలుగు విజయాలు- ఎనిమిది పాయింట్లు టీమిండియా ఖాతాలో ఉన్నాయి.

తన తదుపరి మ్యాచ్ ఆడబోతోంది టీమిండియా. న్యూజిలాండ్‌ను ఎదుర్కొనబోతోంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల స్టేడియంలో ఈ పోరు ఆరంభమౌతుంది. ఈ రెండు జట్లకూ ఇది అయిదో మ్యాచ్. ఓటమి అనేది ఎరుగవు ఈ రెండు జట్లు కూడా.

CWC 2023: Key Indian players including Virat Kohli likely to get brief break

వరల్డ్ కప్ 2023లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లనూ గెలిచాయి. చెరో ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. నెట్ రన్‌రేట్ ఆధారంగా భారత్ రెండోస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా టీమ్ మూడో స్థానంలో కొనసాగుతోంది.

న్యూజిలాండ్‌తో మ్యాచ్ తరువాత సీనియర్లు బ్రేక్ తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. కేప్టెన్ రోహిత్ శర్మ సైతం ఒకట్రెండు మ్యాచ్‌ల కోసం బ్రేక్ తీసుకుంటాడని చెబుతున్నారు. కివీస్‌తో మ్యాచ్ తరువాత సుదీర్ఘమైన విరామం రావడం, మున్ముందు బలమైన జట్లను ఎదుర్కొనాల్సి వస్తోండటం వల్ల బ్రీఫ్ బ్రేక్ తప్పకపోవచ్చని అంటున్నారు.

ఈ లిస్ట్‌లో రోహిత్ శర్మ ఒక్కడే కాదు.. మరో అయిదుమంది కీ ప్లేయర్ల పేర్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, జస్‌ప్రీత్ బుమ్రా కూడా బ్రేక్ తీసుకోవచ్చని తెలుస్తోంది. వారి కుటుంబ సభ్యులతో గడపడానికి కొంత సమయం ఇచ్చినట్టవుతుందని బీసీసీఐ భావిస్తోన్నట్లు సమాచారం.

న్యూజిలాండ్‌తో మ్యాచ్ తరువాత మరో గేమ్ ఆడటానికి వారం రోజుల పాటు ఎదురు చూడాల్సి ఉంటుంది టీమిండియాకు. తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 29వ తేదీన ఆడాల్సి ఉంది. బలమైన ఇంగ్లాండ్‌ను ఢీ కొట్టాల్సి ఉంది. బ్యాక్ టు బ్యాక్ హెవీ మ్యాచ్‌లే ఇవి. ఈ నేపథ్యంలో కివీస్‌తో మ్యాచ్ తరువాత వారం రోజుల పాటు మరో గేమ్ లేకపోవడం వల్ల ఆ సమయంలో కీ ప్లేయర్లకు బ్రేక్ ఇస్తే రీఛార్జ్ అవుతారని బీసీసీఐ భావిస్తోంది. ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్ కూడా ధర్మశాలలోనే షెడ్యూల్ అయింది.

Story first published: Saturday, October 21, 2023, 13:26 [IST]
Other articles published on Oct 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+