Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్ వరుస ఓటములపై ఆసీస్ కేప్టెన్- భలే చెప్పాడే..!!

Pat Cummins: ఐసీసీ ప్రపంచకప్ 2023 టోర్నమెంట్‌లో దారుణంగా ఆడుతోంది డిఫెండింగ్ ఛాంపియన్.. ఇంగ్లాండ్. వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతోంది. తొలి మ్యాచ్‌లోనే తన చిరకాల ప్రత్యర్థి న్యూజిలాండ్ చేతిలో మట్టికరిచిన అనంతరం కోలుకోలేకపోతోంది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచిందా జట్టు.

ఇప్పటివరకు ఆడిన అయిదు మ్యాచ్‌లల్లో ఒక్కదాంట్లో మాత్రమే విజయం సాధించింది. నాలుగింట్లో దారుణ పరాజయాన్ని చవి చూసింది. చివరికి ఆఫ్ఘనిస్తాన్‌, శ్రీలంకపైనా ఓటమి పాలవడం.. ఇంగ్లాండ్ అధ్వాన్నపు ఆటతీరుకు అద్దం పట్టినట్టయింది. ఈ టోర్నమెంట్‌లో మున్ముందు మరిన్ని కష్టాలను ఎదుర్కొనక తప్పని పరిస్థిితులు ఉన్నాయి ఇంగ్లాండ్‌కు.

CWC 2023: Its very sad to see, Pat Cummins reaction on Englandsdefeat against Sri Lanka

తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓటమిపాలైంది. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై తిరుగులేని విజయం సాధించింది. తొమ్మిది వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసి, బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన అనంతరం ఇంగ్లాండ్ గాడినపడిందనే అనుకున్నారు.. గానీ అది గాలివాటమేనని తేలింది. తన మూడో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో, అనంతరం దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో చిత్తయింది.

శ్రీలంక చేతిలోనూ మట్టికరిచింది. ఇక తన తదుపరి మ్యాచ్‌లో భారత్‌ను ఎదుర్కొనబోతోంది. ఈ నెల 29వ తేదీన లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియంలో జరుగనుందీ మ్యాచ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియాను ఓడించడం గగనమే అవుతుంది ఇంగ్లాండ్‌కు. రెట్టింపు సత్తా చాటితే గానీ భారత్‌పై జయకేతనం ఎగురవేయడం అసాధ్యం.

ఇంగ్లాండ్ ఎదుర్కొంటోన్న ఈ దారుణ పరిస్థితిపై ఆస్ట్రేలియా కెేప్టెన్ పాట్ కమ్మిన్స్ రియాక్ట్ అయ్యాడు. విలేకరుల సమావేశంలో అతను మాట్లాడాడు. ఇంగ్లాండ్ వరుస ఓటములు తనను బాధ కలిగిస్తోన్నాయని చెప్పాడు. ఆ జట్టు పుంజుకొంటోందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు పాట్ కమ్మిన్స్.

శ్రీలంకపై ఇంగ్లాండ్ ఓటమి చెందడాన్ని చూసి, గుండె పగిలిపోయినట్టయిందంటూ డ్రెస్సింగ్ రూమ్‌లో వ్యాఖ్యానించారా? అంటూ విలేకరుల అడిగిన ప్రశ్నకు అతను సానుకూలంగా బదులిచ్చాడు. అవునని చెప్పాడు. ఇంగ్లాండ్ ఓడిపోవడం తనను కలిచి వేసిందని, ఇలా ఓడిపోతుందని ఊహించలేదని చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, October 27, 2023, 16:20 [IST]
Other articles published on Oct 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+