Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్ ముగిసిన వెంటనే టీమిండియా ఏపీ బాట: ఛలో వైజాగ్

బెంగళూరు: ఐసీసీ ప్రపంచ కప్‌ 2023లో ముగింపు దశకు వచ్చేసింది. గ్రూప్స్ దశలో ఒక్కో మ్యాచ్ మాత్రమే మిగిలివుంది. నేడు రెండు మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా- బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.

రెండోది- మధ్యాహ్నం 2 గంటలకు కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో. ఇంగ్లాండ్‌ను ఢీకొడుతుంది పాకిస్తాన్. గ్రూప్ దశలో ఈ నాలుగు జట్లకూ ఇవే చివరి మ్యాచ్‌లు. ఇందులో ఆస్ట్రేలియా ఒక్కటే సెమీ ఫైనల్స్‌కు చేరింది. మిగిలిన మూడూ ఇంటిదారి పట్టక తప్పదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్.. సెమీ ఫైనల్స్ రేసు నుంచి వైదొలిగాయి.

CWC 2023: Indias squad for T20I series against Australia set to be announced after the Semifinals

ఇక భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను ఆదివారం ఆడబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌తో వరల్డ్ కప్ 2023 లీగ్స్ దశకు తెర పడుతుంది. ఇక సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌పై అందరి దృష్టీ నిలుస్తుంది.

ఈ నెల 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ జరుగుతాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. 15వ తేదీన జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొడుతుంది న్యూజిలాండ్. దీనికి ముంబైలోని వాంఖెడె స్టేడియం వేదిక. ఆ మరుసటి రోజున కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది ఆస్ట్రేలియా. 19 నాటి ఫైనల్‌కు గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యాన్ని ఇస్తుంది.

వరల్డ్ కప్ ఫైనల్స్ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆరంభమౌతుంది. అయిదు మ్యాచ్‌లో సిరీస్ ఇది. వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను ఆరంభం కావడానికి ముందు ఆస్ట్రేలియాతో మూడు వన్డే ఇంటర్నేషనల్స్‌ను ఆడింది టీమిండియా. 2-1 తేడాతో ఆ సిరీస్‌ను గెలిచిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా టీ20 సిరీస్ మొదలవుతుంది.

నవంబర్ 19వ తేదీన వరల్డ్ కప్ 2023 ఫైనల్ ముగియనుండగా.. అదే నెల 23వ తేదీన ఈ టీ20 సిరీస్ షురూ అవుతుంది. విశాఖపట్నం స్టేడియం దీనికి వేదిక. మొత్తం అయిదు మ్యాచ్‌ల సిరీస్ ఇది. 23, 26, 28, డిసెంబర్ 1, 3వ తేదీల్లో ఇవి షెడ్యూల్ అయ్యాయి. విశాఖతో పాటు తిరువనంతపురం, గువాహటి, నాగ్‌పూర్, బెంగళూరుల్లో ఈ మ్యాచ్‌లు షెడ్యూల్ జరుగుతాయి.

ఈ టీ20 సిరీస్‌లో భారత్‌తో తలపడే జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ఇదివరకే ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులు ఉండే టీమ్ ఇది. వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్.. దీనికి సారథ్యాన్ని వహిస్తాడు. టీ20 స్పెషలిస్ట్‌గా పేరుంది వేడ్‌కు. అందుకే కీలకమైన ఈ సిరీస్ కోసం అతనికి జట్టు పగ్గాలను అప్పగించింది.

ఇందులో- మాథ్యూ వేడ్ (కేప్టెన్) జేసన్ బెహ్రెన్‌డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), స్పెన్సర్ జాన్సన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపాకు చోటు కల్పించింది.

కాగా ఈ సిరీస్ ఆడబోయే భారత జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ఐసీసీ వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ ముగిసిన వెంటనే జట్టును వెల్లడించే అవకాశం ఉంది. తొలి సెమీస్‌లో ముగిసిన మరుసటి రోజే అంటే 16వ తేదీన టీమ్‌ను వెల్లడిస్తుంది. ఈ నెల 20వ తేదీన జట్టు మొత్తం కూడా విశాఖపట్నానికి చేరుకుంటుంది.

Story first published: Saturday, November 11, 2023, 13:14 [IST]
Other articles published on Nov 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+