Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గర్ల్‌ఫ్రెండ్‌తో టీమిండియా డాషింగ్ ఓపెనర్: పబ్లిగ్గా ఆ ముద్దులేంటీ.. ఆ హగ్గులేంటీ

ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఆరు విజయాలతో సెమీ ఫైనల్స్ వైపు దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ తరువాత దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

తన తదుపరి మ్యాచ్‌ను నవంబర్ 2వ తేదీన ఆడబోతోంది టీమిండియా. శ్రీలంకను ఎదుర్కొనబోతోంది. ముంబైలోని వాంఖెడె స్టేడియం దీనికి వేదిక. మధ్యాహ్నం 2 గంటలకు ఈ పోరు ఆరంభమౌతుంది. శ్రీలంకపైనా టీమిండియా ఇదే దూకుడును కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.

sara tendlukar gill

ఈ మ్యాచ్ కోసం రెండు జట్లూ ఇప్పటికే ముంబై చేరుకున్నాయి. వాంఖెడే స్టేడియంలో నెట్ ప్రాక్టీస్‌లో గడుపుతున్నాయి. శ్రీలంకపై గెలవడం వల్ల తన సెమీ ఫైనల్స్ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలనే పట్టుదల టీమిండియాలో కనిపిస్తోంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కేప్టెన్ రోహిత్ శర్మ.. ఈ దిశగా జట్టును సమాయాత్తం చేస్తోన్నారు.

శ్రీలంకతో మ్యాచ్‌ను మినహాయిస్తే లీగ్ దశలో ఇంకో రెండు మాత్రమే భారత్ చేతిలో ఉంటాయి. ఈ నెల 5వ తేదీన ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో ఒకటి. బెంగళూరు ఎం చిన్నస్వామి స్టేడియంలో నెదర్లాండ్స్‌తో మరో గేమ్ మిగిలివుంటాయి. ఈ రెండింటి గెలుపోటములతో సంబంధం లేకుండా శ్రీలంకపై గెలిచి సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టాలని భావిస్తోంది.

ఈ పరిస్థితుల్లో డాషింగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్‌తో సారా టెండుల్కర్‌తో కనిపించాడు. ఓ రెస్టారెంట్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరుగాడాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శుభ్‌మన్ గిల్ టీషర్ట్, దానిపై బ్లాక్ కలర్ జీన్స్ వేసుకోగా.. రెడ్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతూ కనిపించింది సారా టెండుల్కర్.

తమ కామన్ ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఎంట్రన్స్ వద్దే ఆమె ఆగిపోగా.. గిల్ మాత్రం ఓ రెస్టారెంట్ నుంచి గిల్ ముందుగా బయటికి రావడం, అతని వెనకే ఉన్న సారా టెండుల్కర్.. ఎంట్రన్స్ వద్దే నిలిచిపోవడం ఈ వీడియోలో చూడొచ్చు. దీని మీద మీమ్స్ మొదలయ్యాయి అప్పుడే. లవ్ బర్డ్స్ ముంబైలో చక్కర్లు కొడుతున్నాయంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Story first published: Wednesday, November 1, 2023, 13:39 [IST]
Other articles published on Nov 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+