Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓ పాత రికార్డును బద్దలు కొట్టిన షమీ..!!

Mohammad Shami: ఐసీసీ ప్రపంచకప్ 2023.. టీమిండియా విజృంభణకు అద్దం పడుతోంది. సత్తా ఏమిటో మరోసారి క్రికెట్ ప్రపంచానికి చాటి చెబుతోంది. ఇప్పటివరకు ఓటమి అంటే తెలియని జట్టు ఏదైనా ఉందంటే అది భారతే. సగం టోర్నమెంట్ అయినపోయినప్పటికీ టీమిండియాను కొట్టే జట్టే లేదు.

ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. భారత్ ముందు మోకరిల్లక తప్పలేదు. ఇంగ్లాండ్‌ను సైతం చిత్తు చేసింది రోహిత్ సేన. ఇప్పటివరకు ఆరు విజయాలు- 12 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. వరల్డ్ కప్ 2023 సెమీ ఫైనల్ బెర్త్‌ను దాదాపుగా ఖాయం చేసుకుంది.

CWC 2023, IND vs SL: Mohammed Shami has surpassed Ajit Agarkar in these record

టీమిండియా సమష్ఠిగా రాణిస్తోండటమే ఈ వరుస విజయాలను ప్రధాన కారణం అనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని డిపార్ట్‌మెంట్లల్లోనూ ప్రత్యర్థిపై పైచేయిని సాధిస్తోంది. ఆధిపత్యాన్ని చలాయిస్తోంది. ప్రతి మ్యాచ్‌లోనూ కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, కేఎల్ రాహుల్.. తమ ప్రతాపం చూపుతోన్నారు.

మహ్మద్ షమీ రాకతో బౌలింగ్ విభాగం మరింత స్ట్రాంగ్ అయింది. షమీ, మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలతో కూడిన టీమిండియా బౌలింగ్‌ను ఢీ కొట్టే శక్తి సామర్థ్యాలు ప్రస్తుతం ఏ జట్టుకూ లేదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఇంగ్లాండ్.. వంటి బలమైన జట్లు దాసోహం అయ్యాయి.

అటు వరల్డ్ కప్‌లో మహ్మద్ షమీ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఇప్పటివరకు తొమ్మిది వికెట్లను తీసుకున్నాడు. ఈ క్రమంలో ఓ పాత రికార్డును తిరగరాశాడు. ఎక్కువ సార్లు నాలుగు వికెట్లను పడగొట్టిన ఘనతను తన పేరు మీద లిఖించుకున్నాడు. వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి బౌలర్ అయ్యాడు.

గతంలో ఈ రికార్డు అజిత్ అగార్కర్ పేరు మీద ఉండేది. అజిత్ అగార్కర్ ఒకే ఇన్నింగ్‌లో 12 సార్లు నాలుగు వికెట్లను పడగొట్టాడు. దీన్ని అధిగమించాడు షమీ. 13 సార్లు అతను ఈ ఫీట్‌ను నమోదు చేసుకున్నాడు తన పేరు మీద. అనిల్ కుంబ్లే- 10, జవగళ్ శ్రీనాథ్- 10, కుల్‌దీప్ యాదవ్-9 సార్లు ఒకే ఇన్నింగ్‌లో నాలుగు వికెట్లు తీసుకున్నారు.

Story first published: Tuesday, October 31, 2023, 13:40 [IST]
Other articles published on Oct 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+