Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా..!!

కోల్‌కత: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న భారత జట్టుకు బిగ్ షాక్. గాయం బారిన పడ్డ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నాడు. గాయం నుంచి కోలుకోలేకపోవడం వల్ల అతను జట్టులోకి రీఎంట్రీ ఇవ్వట్లేదు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ వెల్లడించింది.

నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్ నాటికి హార్దిక్ పాండ్యా జట్టుకు అందుబాటులోకి వస్తాడని మొదట్లో అభిప్రాయాలు వ్యక్తం అయినప్పటికీ- అదంతా తలకిందులయింది. గాయం నుంచి పాండ్యా ఇంకా కోలుకోలేదని, ఫిట్ నెస్ పరీక్షల్లో విఫలం అయ్యాడని బీసీసీఐ తెలిపింది. టోర్నమెంట్ నుంచి వైదొలగినట్లు పేర్కొంది.

CWC 2023, IND vs SA: Tough to digest the fact, Hardik Pandya reaction afterhisruledout

టీమిండియా సెమీ ఫైనల్స్ బెర్త్ కన్‌ఫర్మ్ అయిన నేపథ్యంలో- హార్దిక్ పాండ్యాను నేరుగా ఆ మ్యాచ్‌లల్లోనే ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ తొలుత నిర్ణయించింది. ఆ తరువాత తన నిర్ణయాన్ని మార్చుకుంది. గాయపడి కోలుకున్న తరువాత నేరుగా సెమీ ఫైనల్స్ ఆడించడం కంటే కూడా నెదర్లాండ్స్‌పై ఆడే తుదిజట్టులోకి తీసుకోవాలని భావించింది.

అతను కోలుకోకపోవడంతో అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. హార్దిక్ పాండ్యా స్థానంలో బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్దారించింది. హార్దిక్ పాండ్యా బదులుగా ప్రసిద్ధ్ కృష్ణను టీమిండియా జట్టులోకి తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఈ ఉదంతంపై హార్దిక్ పాండ్యా స్పందించాడు. ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ నుంచి అర్ధాంతరంగా వైదొలగడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రపంచ కప్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం అయ్యాననే నిజాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని వ్యాఖ్యానించాడు. జట్టు విజయాల్లో భాగస్వామిని కాలేకపోతున్నానని పేర్కొన్నాడు.

ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో కొంత సమాచారాన్ని పోస్ట్ చేశాడు. తాను జట్టు వెంటే ఉంటానని, ప్రతి గేమ్‌, ప్రతి బంతికీ ప్లేయర్లను ఉత్సాహ పరుస్తానని హార్దిక్ పాండ్యా చెప్పాడు. గెలుపు స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. వరల్డ్ కప్‌లో మిగిలిన మ్యాచ్‌లను ఆడనున్న జట్టు ప్లేయర్లకు అడ్వాన్స్ విషెస్ చెప్పాడు పాండ్యా.

ప్రేక్షకులు, అభిమానులు ఇన్ని రోజులు తనకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ వరల్డ్ కప్‌ను టీమిండియా గెలుస్తుందనే ధీమాను వ్యక్తం చేశాడు హార్దిక్ పాండ్యా. ఈ టీమ్ ఎంతో ప్రత్యేకమైనదని, ప్రతి ఒక్కరినీ గర్వపడేలా చేస్తుందని చెప్పాడు. దేశ ప్రజలకు అద్భుత కానుకను ఖచ్చితంగా ఇస్తుందని తాను భావిస్తున్నానని అన్నాడు.

Story first published: Saturday, November 4, 2023, 11:40 [IST]
Other articles published on Nov 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+