రోహిత్‌ను భయపెట్టగలిగే దక్షిణాఫ్రికా బౌలర అతనే..!!
Rohit Sharma vs Kagiso Rabada: ఐసీసీ ప్రపంచకప్ 2023లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోన్న టీమిండియా.. నేడు మరో మ్యాచ్ ఆడబోతోంది. వరుసగా ఏడు విజయాలతో ఇప్పటికే సెమీ ఫైనల్స్ బెర్త్ ఖరారయిన నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో షెడ్యూల్ అయిందీ గేమ్.
దక్షిణాఫ్రికా కూడా అదే స్థాయిలో సత్తా చాటుతూ వస్తోంది. ఆ జట్టు ఖాతాలో ఒక ఓటమి ఉన్నప్పటికీ.. ఎక్కడా తగ్గట్లేదు. సెమీ ఫైనల్స్‌కు కూడా చేరుకుంది. బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవడం దక్షిణాఫ్రికాకు కలిసొచ్చింది. టీమిండియాపై జరిగే మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ పెద్దగా తేడా ఏమీ ఉండదు.

దక్షిణాఫ్రికా ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉంటోంది. టీమ్ మొత్తం అద్భుతంగా రాణిస్తోంది. బ్యాటింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతోంది. నిప్పుల్లాంటి బంతులను సంధిస్తోన్నారు ఆ జట్టు బౌలర్లు. ఫీల్డింగ్‌లోనూ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. మెరుపులను మెరిపిస్తోంది. సంక్లిష్టమైన క్యాచ్‌ను కూడా అందుకుంటోన్నారు ప్లేయర్లు.
ఆ జట్టు బౌలింగ్ వెన్నెముక కగిసొ రబడ. అతని బౌలింగ్‌లో రోహిత్ శర్మ ప్రతీసారీ విఫలమౌతోన్నాడు .పరుగులు చేయడానికి కష్టపడుతున్నాడు. భారీ షాట్లతో ఇతర బౌలర్లపై సునామీలా విరుచుకుపడే రోహిత్ శర్మ.. కగిసొ రబడ బౌలింగ్ కొరుకుడు పడట్లేదు. ఆచి తూచి ఆడతాడు.

దీనికి నిదర్శనం- అతను ఆడిన ఇన్నింగ్సే. ఇప్పటివరకు 12 ఇన్నింగ్‌లల్లో రబడ బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు రోహిత్ శర్మ. 131 పరుగులు మాత్రమే చేశాడు. నాలుగు సార్లు తన వికెట్‌ను అతనికి సమర్పించుకున్నాడు. అతని బౌలింగ్‌లో ఇప్పటివరకు 19 బౌండరీలు మాత్రమే కొట్టగలిగాడు. మూడు సిక్సర్లే నమోదయ్యాయి. బ్యాటింగ్ యావరేజ్ 32.75గా నమోదైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications