Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న పాకిస్తాన్ లెజెండ్.. ఫిదా

Happy birthday Virat Kohli: నేడు.. టీమిండియా బ్యాటింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ బర్త్‌డే. ఇదే రోజున అతని దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కూడా ఉండటం అభిమానుల్లో జోష్ నింపింది. భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వేదిక అయిన కోల్‌కతలో పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకొంటోన్నారు. భారీ కేక్‌ను కట్ చేశారు.

ఈడెన్ గార్డెన్స్ వద్ద అభిమానులు సందడి కొనసాగుతోంది. ఈ ఉదయం నుంచే వారు గుంపులు గుంపులుగా ఈడెన్ గార్డెన్స్‌కు చేరుకుంటోన్నారు. కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఈ స్టేడియానికి దారి తీసే మార్గాల్లో బ్యానర్ల, ఫ్లెక్సీలు, భారీ కటౌట్లను నెలకొల్పారు.

CWC 2023, IND vs SA: Former Pakistan bowler Waqar Younis hugged Virat Kohli and wished him

స్టేడియం లోపలా కోహ్లీని శుభాకాంక్షలతో ముంచెత్తారు అభిమానులు. ఈ జాబితాలో లెజెండరీ ప్లేయర్లు సైతం ఉన్నారు. మ్యాచ్‌లో కామెంటేటర్లుగా వ్యవహరిస్తోన్న మాజీ క్రికెటర్లు గ్రౌండ్‌కు వచ్చి మరీ కోహ్లీకి విషెస్ తెలిపారు. ఈ వరల్డ్ కప్‌లో అతని ప్రదర్శనను మెచ్చుకున్నారు.

దక్షిణాఫ్రికా లెజెండరీ బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ ఏబీ డివిలియర్స్.. కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. కోహ్లీ బర్త్ డే అంటే తన పుట్టినరోజు కంటే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటానని వ్యాఖ్యానించాడు. గతంలో ఐపీఎల్ టోర్నమెంట్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన రోజులను గుర్తు చేసుకున్నాడు. ఆర్సీబీతో తమ బంధం మరింత బలపడిందని పేర్కొన్నాడు.

విరాట్ కోహ్లీకి బర్త్ డే విషెస్ చెప్పిన వారిలో పాకిస్తాన్ మాజీ స్టార్ పేస్ బౌలర్ వకార్ యూనిస్ కూడా ఉన్నాడు. కోహ్లీ ఈడెన్ గార్డెన్స్‌లో కనిపించిన కొద్దిసేపటికే అతని వద్దకు వెళ్లాడు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని, జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ఆ సమయంలో ఏబీ డివిలియర్స్ అక్కడే ఉన్నాడు.

Story first published: Sunday, November 5, 2023, 13:42 [IST]
Other articles published on Nov 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+