Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టైల్ మార్చిన కింగ్: ట్రెండ్ ఫాలో అవ్వడు- సెట్ చేస్తాడు: కటింగ్ చేయించుకుంటూనే..!!

కోల్‌కత: ఐసీసీ ప్రపంచకప్ 2023లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోన్న టీమిండియా.. నేడు మరో మ్యాచ్ ఆడబోతోంది. వరుసగా ఏడు విజయాలతో ఇప్పటికే సెమీ ఫైనల్స్ బెర్త్ ఖరారయిన నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో షెడ్యూల్ అయిందీ గేమ్.

ఇప్పటికే రెండు జట్లూ కోల్‌కతకు చేరుకున్నాయి. నెట్ ప్రాక్టీస్‌లో చెమటోడుస్తోన్నాయి. అటు దక్షిణాఫ్రికా సైతం ఊపు మీద ఉంది. ఓ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. ఎలాంటి ప్రభావం పడలేదు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌‌లల్లో ఆరింట్లో గెలిచింది. అవన్నీ హై-స్కోర్ మ్యాచ్‌లే. ఓపెనర్ క్వింటన్ డికాక్ సహా వాన్ డెర్ డస్సెన్, బ్యాటర్లు ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్.. ఇలా జట్టు మొత్తం ఫుల్ ఫామ్‌లో ఉంది.

CWC 2023, IND vs SA: An attractive new trendy hairstyle of birthdayboyViratKohli

భారత్ తరువాత సెమీ ఫైనల్స్ చేరిన రెండో జట్టు దక్షిణాఫ్రికే. బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను పాకిస్తాన్ ఓడించడంతో దక్షిణాఫ్రికా లబ్ది పొందింది. మిగిలిన మ్యాచ్‌లల్లో జయాపజయాలతో సంబంధం లేకుండా ఆ జట్టు సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. ఇంకో రెండు బెర్త్‌లో మిగిలివున్నాయి. ఓ బెర్త్ ఆస్ట్రేలియాకు దాదాపుగా ఖాయమైనట్టే.

అటు విరాట్ కోహ్లీ బర్త్‌డే కూడా కలిసి రావడంతో అభిమానుల ఆనందానికి హద్దులు ఉండట్లేదు. ఫ్యాన్స్‌లో జోష్ పెరిగింది. కోల్‌కతలో పెద్ద ఎత్తున వేడుకలు షురూ చేశారు. భారీ కేక్‌ను కట్ చేశారు. ఈడెన్ గార్డెన్స్ వద్దా అభిమానులు సందడి చేశారు. కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఈ స్టేడియానికి దారి తీసే మార్గాల్లో బ్యానర్ల, ఫ్లెక్సీలు, భారీ కటౌట్లను నెలకొల్పారు.

బర్త్‌డే సందర్భంగా విరాట్ కోహ్లీ కొత్త లుక్స్‌తో కనిపించాడు. హెయిర్ స్టైల్‌ మార్చేశాడు. మరింత హ్యాండ్‌సమ్‌గా కనిపించాడీ బర్త్‌డే బాయ్. అతనికి 35 సంవత్సరాలంటే నమ్మశక్యం కాని విధంగా తయారయ్యాడు. ట్రెండ్ ఫాలో అవ్వడు.. ట్రెండ్ సెట్ చేస్తాడన్నట్లుగా కొత్త లుక్స్‌తో కట్టి పడేశాడు.

CWC 2023, IND vs SA: An attractive new trendy hairstyle of birthdayboyViratKohli

కోల్‌కతలో తాము బస చేసిన హోటల్‌లోనే హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు కోహ్లీ. తన రెగ్యులర్ హెయిర్ స్టైలిస్ట్‌ను హోటల్‌కు పిలిపించుకున్నాడు. హెయిర్ కట్ చేయించుకుంటూనే టీవీలో- బెంగళూరులో న్యూజిలాండ్- పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ను అసాంతం తిలకించాడు..

Story first published: Sunday, November 5, 2023, 10:56 [IST]
Other articles published on Nov 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+