Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్దిక్ పాండ్యాకు రీప్లేస్..?: ఆ ఇద్దరిలో ఎవరు..?

సిమ్లా: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టుగా నిలిచారు బ్లాక్ క్యాప్స్. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించారు. న్యూజిలాండ్ తరువాత భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. నాలుగు విజయాలు- ఎనిమిది పాయింట్లు టీమిండియా ఖాతాలో ఉన్నాయి.

తన తదుపరి మ్యాచ్ ఆడబోతోంది టీమిండియా. న్యూజిలాండ్‌ను ఎదుర్కొనబోతోంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల స్టేడియంలో ఈ పోరు ఆరంభమౌతుంది. ఈ రెండు జట్లకూ ఇది అయిదో మ్యాచ్. ఓటమి అనేది ఎరుగవు ఈ రెండు జట్లు కూడా.

CWC 2023, IND vs NZ: Suryakumar Yadav or Shami to replace injured Hardik Pandya

వరల్డ్ కప్ 2023లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లనూ గెలిచాయి. చెరో ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టిలో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. నెట్ రన్‌రేట్ ఆధారంగా భారత్ రెండోస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా మూడో స్థానంలో కొనసాగుతోంది.

ఇప్పటివరకు ఓటమి అనేది తెలియని జట్లు ఏవైనా ఉన్నాయంటే అది భారత్, న్యూజిలాండ్. టేబుల్ టాపర్స్ మధ్య మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ధర్మశాల స్టేడియంలో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవరు ఓడినా.. ఆ జట్టుకు తొలి ఓటమి అవుతుంది.

ఈ పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా గాయపడటం భారత్‌ను కలవరపాటుకు గురి చేస్తోంది. బౌలర్‌గా, బ్యాటర్‌గా రాణిస్తోన్న పాండ్యా కీలక మ్యాచ్‌కు ముందు గాయపడటం ఒకింత ఆందోళనకు గురి చేస్తోంది జట్టు మేనేజ్‌మెంట్‌ను. అతని స్థానంలో ఖచ్చితంగా మరో ప్లేయర్‌ను ఆడించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. 9వ ఓవర్ బౌలింగ్ చేస్తోన్నప్పుడు అతను వేసిన బంతిని లిటన్ దాస్ స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. ఆ బంతిని హార్దిక్ కాలితో ఆపడానికి ప్రయత్నించినప్పుడు కింద పడ్డాడు. ఫలితంగా అతని ఎడమకాలి మడమకు గాయమైంది. అప్పటికప్పుడు గ్రౌండ్‌ను వీడివెళ్లాడు. మళ్లీ వెనక్కి రాలేదు.

గాయం తీవ్రత కారణంగా హార్దిక్‌కు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినట్లు బీసీసీఐ వెల్లడించారు. దీనితో న్యూజిల్యాండ్‌తో జరగబోయే మ్యాచ్‌కు పాండ్యా అందుబాటులో ఉండట్లేదు. అతని స్థానంలో ఇద్దరి పేర్లను పరిశీలిస్తోంది బోర్డు. మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ లేదా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీల్లో ఒకరిని న్యూజిలాండ్‌పై ఆడించాలని భావిస్తోంది.

CWC 2023, IND vs NZ: Suryakumar Yadav or Shami to replace injured Hardik Pandya

వారిద్దరూ ఐసీసీ వరల్డ్ కప్ ఆడే జట్టుకు ఎంపికయ్యారు. ఇప్పటివరకు మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు. జట్టు సమష్ఠిగా రాణిస్తోన్న నేపథ్యంతో తుదిజట్టులో ఎలాంటి మార్పులు చేయట్లేదు మేనేజ్‌మెంట్. హార్దిక్ అందుబాటులో రాకపోవడం వల్ల ఈ ఇద్దరిలో ఒకర్ని దింపడం ఖాయంగా కనిపిస్తోంది.

Story first published: Saturday, October 21, 2023, 12:31 [IST]
Other articles published on Oct 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+