For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డేల్లో మొనగాడు: ఎవ్వరికీ సాధ్యం కాని అరుదైన రికార్డుకు చేరువలో..!!

సిమ్లా: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగు విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టుగా నిలిచారు బ్లాక్ క్యాప్స్. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించారు. న్యూజిలాండ్ తరువాత భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. నాలుగు విజయాలు- ఎనిమిది పాయింట్లు టీమిండియా ఖాతాలో ఉన్నాయి.

తన తదుపరి మ్యాచ్ నేడు ఆడబోతోంది టీమిండియా. బలమైన న్యూజిలాండ్‌ను ఎదుర్కొనబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల స్టేడియంలో ఈ పోరు ఆరంభమౌతుంది. ఈ రెండు జట్లకూ ఇది అయిదో మ్యాచ్. ఓటమి అనేది ఎరుగవు ఈ రెండు జట్లు కూడా.

CWC 2023, IND vs NZ: Shubman Gill needs 14 runs to reach 2000 ODI runs

వరల్డ్ కప్ 2023లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లనూ గెలిచాయి. చెరో ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టిలో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. న్యూజిలాండ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. నెట్ రన్‌రేట్ ఆధారంగా భారత్ రెండోస్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆరు పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి.

ఈ మ్యాచ్‌తో శుభ్‌మన్ గిల్.. ఓ అరుదైన రికార్డును నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికోసం పెద్దగా అతను కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే- ఓ 14 పరుగులు చేస్తే చాలు. ఈ రికార్డు అతనిదవుతుంది. న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌తోనే అది సాధ్యం అవుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

ఆ రికార్డే- 2,000 పరుగులు. ఈ క్లబ్‌లో చేరడానికి శుభ్‌మన్ గిల్‌కు 14 పరుగుల దూరంలో నిలిచాడు. అతి తక్కువ ఇన్నింగ్‌లతో ఈ మైలురాయిని అందుకోబోతోన్న ఏకైక ప్లేయర్ అతనొక్కడే. ఇప్పటివరకు 37 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు గిల్. 1986 పరుగులు చేశాడు. వ్యక్తిగత అత్యధిక పరుగులు 208. ఆరుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 64.06.

ఈ రికార్డు ఎవరి పేరు మీదా లేదు. వన్డేల్లో శరవేగంగా 2,000 పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హషీమ్ ఆమ్లా. 40 మ్యాచ్‌లల్లో అతను ఈ ఘనతను సాధించాడు. శుభ్‌మన్ గిల్ 38 ఇన్నింగ్స్‌లల్లోనే ఈ రికార్డును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Story first published: Sunday, October 22, 2023, 12:35 [IST]
Other articles published on Oct 22, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+