For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ కేప్టెన్సీ వద్దనుకున్నాడా?: బలవంతంగా కట్టెబెట్టారా?: బాంబు పేల్చిన గంగూలీ

Rohit Sharma: ఐసీసీ ప్రపంచకప్ 2023లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది టీమిండియా. వరుసగా ఎనిమిది విజయాలను సాధించింది. సెమీ ఫైనల్స్‌లో అడుగు పెట్టిన మొట్టమొదటి జట్టు ఇదే. ఆ తరువాతే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వచ్చి చేరాయి. ఈ నాలుగు జట్లు వరల్డ్ కప్ కోసం పారాడనున్నాయి.

తన చివరిదైన గ్రూప్ మ్యాచ్‌ను ఈ నెల 12వ తేదీన ఆడబోతోంది భారత్. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. దీని తరువాత సెమీ ఫైనల్స్ కోలాహలం ఆరంభమౌతుంది. 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్, 19వ తేదీన ఫైనల్స్ ఉంటుంది. సెమీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను ఎదుర్కొనబోతోంది భారత్.

CWC 2023, IND vs NZ: Rohit Sharma doesnt wanted the captaincy, says Sourav Ganguly

ఈ వరుస విజయాల్లో కెేప్టెన్‌గా, జట్టు ఓపెనర్‌గా కీలక పాత్రను పోషిస్తోన్నాడు రోహిత్ శర్మ. దక్షిణాఫ్రికా, ఇదివరకు శ్రీలంకను వంద పరుగులు కూడా దాటనివ్వలేదు. బ్యాటర్‌గా భారీ స్కోర్లు చేస్తూనే.. సమయానుకూలంగా బౌలర్లను మార్చ గలుగుతున్నాడు. స్పిన్నర్లు సమర్థవంతంగా వినియోగించుకుంటోన్నాడు.

ఈ పరిస్థితుల్లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ మాజీ ఛైర్మన్ సౌరవ్ గంగూలీ బాంబు పేల్చాడు. టీమిండియా జట్టు పగ్గాలను స్వీకరించడానికి రోహిత్ శర్మ ఏ మాత్రం కూడా ఆసక్తి చూపలేదని అన్నాడు. ఎప్పుడు కూడా అతను కేప్టెన్సీ కోరుకోలేదని వివరించాడు. ఒకరకంగా రోహిత్ శర్మకు ఇష్టం లేకపోయినప్పటికీ సారథిగా చేయాల్సి వచ్చిందని చెప్పాడు.

బీసీసీఐ ఛైర్మన్‌గా సౌరవ్ గంగూలీ కొనసాగుతున్నప్పుడే జట్టు నాయకత్వం చేతులు మారిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్‌ను కేప్టెన్‌గా ప్రకటించిన సెలెక్షన్ కమిటీ. అన్ని ఫార్మట్లలోనూ జట్టు పగ్గాలను అతని చేతుల్లోనే పెట్టింది. ఐపీఎల్‌లో తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ముంబై ఇండియన్స్‌ను సక్సెస్ ఫుల్ టీమ్‌గా తీర్చగలిగినందు వల్లే అతని పేరును పరిశీలనలోకి తీసుకుంది.

అదే విషయాన్ని తాజాగా సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. వన్డే, టీ20 ఇంటర్నేషనల్స్, టెస్ట్ ఫార్మాట్లల్లో జట్టు సారధ్య బాధ్యతలను తీసుకోవడం వల్ల తీవ్ర ఒత్తిడి ఉంటుందని భావించడం వల్లే రోహిత్ శర్మ జట్టు కెప్టెన్సీని కోరుకోలేదని అన్నాడు. కోల్‌కత టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

రోహిత్ శర్మకు కేప్టెన్సీ అప్పగించే విషయంలో పెద్ద తతంగమే నడిచిందని గుర్తు చేశాడు. రోహిత్ శర్మ అంగీకరించితే వెంటనే ఆయన పేరును ప్రకటిస్తాంచాలని నిర్ణయించుకున్నామని, దానికి చాలా సమయం పాటు అతను ఆలోచించాడని అన్నారు. అన్ని రకాలుగా ఆలోచించిన తరువాతే అతను పగ్గాలు అందుకున్నాడని వివరించారు. ఇప్పుడు అతను ముందుండి జట్టును నడిపిస్తోన్నాడని కితాబిచ్చారు.

Story first published: Friday, November 10, 2023, 14:09 [IST]
Other articles published on Nov 10, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+