For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మ కేప్టెన్సీలో టీమిండియాలో అదొక్కటే లోటు..!!

సిమ్లా: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. టీమిండియా ముందు చెతులెత్తేసింది. వరుసగా నాలుగు విజయాలను సాధించిన కివీస్.. భారత్ ముందు మోకరిల్లింది. బలమైన రోహిత్ సేనను కట్టడి చేయడానికి బ్లాక్ క్యాప్స్ పన్నిన వ్యూహాలేవీ ఫలించలేదు.

టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లల్లో 273 పరుగులకు ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర- 75, డారిల్ మిఛెల్- 130 పరుగులతో సత్తా చాటారు. కివీస్ ఇన్నింగ్‌లో వారిద్దరిదే భారీ స్కోర్. లేట్‌గా వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఎంట్రీ ఇచ్చిన మహ్మద్ షమీ అయిదు వికెట్లతో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు.

CWC 2023, IND vs NZ: India have won 14 matches out of last 16 games under Rohit Sharmacaptaincy

274 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్ ఆరంభింంచిన భారత్.. మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్.. స్కోర్ బోర్డ్‌ను పరుగులెత్తించారు. విరాట్ కోహ్లీ మరోసారి భారీ ఇన్నింగ్ ఆడాడు. 95 పరుగులతో చెలరేగాడు. తృటిలో సెంచరీ మిస్ కావడం అభిమానులను నిరాశ పరిచింది.

శ్రేయాస్ అయ్యర్- 33, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్- 27, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా- 39 పరుగులతో రాణించడంతో 48 ఓవర్లలోనే భారత్ విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. అయిదు మ్యాచ్‌లల్లో అయిదు విజయాలతో 10 పాయింట్లను సొంతం చేసుకుంది. తొలి ఓటమిని అందుకున్న న్యూజిలాండ్.. రెండో స్థానంలో నిలిచింది.

ఈ మ్యాచ్‌లో సాధించిన విజయంతో రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అతని కేప్టెన్సీలో టీమిండియా చివరి 16 మ్యాచ్‌లల్లో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. 14 మ్యాచ్‌లల్లో విజయకేతనాన్ని ఎగురవేసింది. ఒక్క మ్యాచ్ ఫలితం తేలలేదు. అది టైగా ముగిసింది.

చివరి 16 మ్యాచ్‌లల్లో తొలి అయిదింట్లో నెగ్గింది భారత్. ఆరో మ్యాచ్ టై అయింది. ఆ తరువాత వరుసగా మరో మూడింటిని కైవసం చేసుకుంది. 10వ మ్యాచ్‌ ఓటమి చవి చూసింది. అదే చివరిది. ఆసియా కప్ సూపర్ 4 దశలో బంగ్లాదేశ్ చేతిలో పరాజయాన్ని చవి చూసింది టీమిండియా. ఆ తరువాత వరుసగా ఆరు మ్యాచ్‌లను గెలిచింది. ఇందులో చివరి అయిదూ వరల్డ్ కప్‌కు చెందినవే.

ఆసియా కప్ 2023, వరల్డ్ కప్ 2023ల్లో భారత్ సాధించిన విజయాలన్నింట్లోనూ కీలక పాత్ర పోషించాడు రోహిత్ శర్మ. సారధిగా జట్టును విజయవంతంగా ముందుకు నడిపించడమే కాకుండా.. ఓ బ్యాటర్‌గానూ సత్తా చాటుతున్నాడు హిట్‌మ్యాన్. రోహిత్ కేప్టెన్సీలో ఆసియా కప్‌ను ముద్దాడిన టీమిండియా.. ఇక వరల్డ్ కప్‌పై కన్నేసింది.

Story first published: Monday, October 23, 2023, 10:00 [IST]
Other articles published on Oct 23, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+