Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్దిక్ పాండ్యాకు లాంగ్ బ్రేక్: ఆ సిరీస్‌కూ దూరం..?!

Hardik Pandya: ఐసీసీ ప్రపంచ కప్‌ 2023లో ముగింపు దశకు వచ్చేసింది. గ్రూప్స్ దశలో ఒక్కో మ్యాచ్ మాత్రమే మిగిలివుంది. న్యూజిలాండ్, శ్రీలంక మినహా అన్ని జట్లూ ఒకటి చొప్పున మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో నేడు దక్షిణాఫ్రికా- ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.

ఈ నెల 12వ తేదీన భారత జట్టు తన చివరి గ్రూప్ మ్యాచ్ ఆడబోతోంది. నెదర్లాండ్స్‌తో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక. ఈ వరల్డ్ కప్‌లో అదే చిట్టచివరిది. దీని తరువాత సెమీ ఫైనల్స్ షెడ్యూల్ అయ్యాయి. 15, 16 తేదీల్లో రెండు సెమీ ఫైనల్స్ ముగుస్తాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్.

CWC 2023, IND vs NZ 1st simifinals: Hardik Pandyaunlikely to play series against Australia

దీని తరువాత టీమిండియా.. మరో సిరీస్ ఆడబోతోంది. టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడబోతోంది. వరల్డ్ కప్ 2023 ఆరంభానికి ముందు ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరస్ ఆరంభమైన విషయం తెలిసిందే. ఈ రెండు జట్లు కూడా మూడు వన్డే మ్యాచ్‌లను ఆడాయి. దీన్ని భారత్ 2-1తో గెలుచుకుంది.

దానికి కొనసాగింపే ఇది. నవంబర్ 19వ తేదీన వరల్డ్ కప్ 2023 ఫైనల్ ముగియనుండగా.. అదే నెల 23వ తేదీన ఈ టీ20 సిరీస్ షురూ అవుతుంది. విశాఖపట్నం స్టేడియం దీనికి వేదిక. మొత్తం అయిదు మ్యాచ్‌ల సిరీస్ ఇది. 23, 26, 28, డిసెంబర 1, 3వ తేదీల్లో ఇవి షెడ్యూల్ అయ్యాయి.

ఈ సిరీస్‌కు కూడా హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు. గాయం కారణంగా ఇప్పటికే అతను వరల్డ్ కప్ 2023 మిగిలిన మ్యాచ్‌ల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కూ అందుబాటులోకి రావడం దాదాపుగా అసాధ్యంగానే కనిపిస్తోంది. అతను అందుబాటులో లేకపోతే.. టీ20 స్పెషలిస్టులు సూర్యకుమార్ యాదవ్ లేదా రుతురాజ్ గైక్వాడ్‌ను జట్టులోకి తీసుకోవచ్చని తెలుస్తోంది.

Story first published: Friday, November 10, 2023, 13:27 [IST]
Other articles published on Nov 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+