Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్- స్విచ్ షాట్: నువ్వు ప్రయోగాలు చెయ్యమాకురా అయ్యా..

ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో నేడు బిగ్ డే. సెమీ ఫైనల్స్ నేటి నుంచి మొదలు కానున్నాయి. నేడు, రేపు రెండు సెమీ ఫైనల్స్ షెడ్యూల్ అయ్యాయి. తొలి సెమీ ఫైనల్స్‌లో భారత్- న్యూజిలాండ్ తలపడనున్నాయి. దీనికి వేదిక.. ముంబైలోని వాంఖెడే స్టేడియం. ఈ మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.

రెండో సెమీస్ కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌‌లో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. 19వ తేదీన గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఈ రెండింటిపైనా ఎన్నో అంచనాలు ఉన్నాయి.

CWC 2023, IND vs NZ 1st semifinals: Virat Kohli practice left-handed batting at nets

ఇంగ్లాండ్‌లో 2019లో జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో ఇదే న్యూజిలాండ్ చేతిలో భారత్ పరాజయాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఏర్పడింది. పైగా ఇలాంటి ఐసీసీ టోర్నమెంట్లల్లో న్యూజిలాండ్‌ను ఓడించిన చరిత్ర టీమిండియాకు ఎప్పుడూ లేదు. ఇది అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. న్యూజిలాండ్ గండాన్ని ఎలా అధిగమిస్తుందనేది ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.

దీనితో అభిమానులు ఇక ఆలయాలకు పరుగులు పెడుతున్నారు. ఈ తెల్లవారు జాము నుంచే దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో హోమాలు, ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా వంటి ప్లేయర్ల ప్లకార్డులను ప్రదర్శిస్తూ అభిమానులు పూజలు, యాగాలు చేస్తోన్నారు.

ఈ పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించడాడు. వాంఖెడే స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ సమయంలో కోహ్లీ చాలా సేపు లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్‌గా మారాడు. అలవోకగా షాట్లను ఆడాడు. స్విచ్ షాట్లను ఆడటానికి ట్రై చేశాడు. కొన్ని రివర్స్ స్వీప్ షాట్లూ ఆడాడు.

ఇది కాస్త అభిమానులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. కీలకమైన సెమీ ఫైనల్స్ మ్యాచ్‌కు ముందు ఇలాంటి ప్రయోగాలు చెయ్యొద్దంటూ పోస్టులు పెడుతున్నారు అభిమానులు. ఇతర మ్యాచ్‌ల సమయంలో ఎలాంటి ప్రయోగాలు చేసినా చెల్లుతుందేమో గానీ సెమీ ఫైనల్స్ ముందు ఇలాంటివి సరికాదని చెబుతున్నారు.

Story first published: Wednesday, November 15, 2023, 11:56 [IST]
Other articles published on Nov 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+