Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగాళాఖాతంలో అల్పపీడనం: సెమీస్‌కు పొంచివున్న వాన గండం: రిజర్వ్ డేపై ఐసీసీ కీలక ప్రకటన

ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. నెదర్లాండ్స్‌ను 160 పరుగుల తేడాతో మట్టికరిపించింది. లీగ్ దశను విజయంతో ముగించింది. 9-0తో క్లీన్ స్వీప్ చేసింది రోహిత్ సేన.

ఈ విజయంతో లీగ్స్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని రికార్డును నెలకొల్పింది భారత్. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లల్లోనూ విజయదుందుభి మోగించింది. తొమ్మిది విజయాలు 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఆ తరువాతి మూడు స్థానాలో ఉన్నాయి.

CWC 2023, IND vs NZ 1st semifinal: Reserve day for 2 Semis and Final match in World Cup 2023

ఈ నెల 15, 16 తేదీల్లో ఈ రెండు సెమీ ఫైనల్స్ నిర్వహించడానికి ఐసీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. టికెట్ల అమ్మకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. తొలి సెమీ ఫైనల్.. భారత్- న్యూజిలాండ్ మధ్య ముంబైలోని వాంఖెడే స్టేడియంలో.. రెండోది దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనున్నాయి. 19వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్ అయింది.

ఈ పరిస్థితుల్లో వర్షం పడితే ఏం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. తొలి సెమీ ఫైనల్ మాట ఎలా ఉన్నప్పటికీ.. రెండో సెమీస్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనున్న కోల్‌కతకు మాత్రం వాన గండం పొంచివుంది. మ్యాచ్ సమయానికి భారీ వర్షం కురిసే అవకాశాలు బాగా ఉన్నాయి.

దీనికి కారణం లేకపోలేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటమే. దీని ప్రభావంతో 15వ తేదీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీతో పాటు, ఒడిశా, పశ్చిమబెంగాల్‌పై దీని తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే రెండో సెమీస్‌కు వర్షం పడటం ఖాయంగా కనిపిస్తోంది.

వర్షం పడి.. మ్యాచ్‌లు రద్దయితే పరిస్థితేమిటనే విషయంపై ఐసీసీ ఓ కీలక ప్రకటన వెలువడించింది. ఈ రెండు సెమీ ఫైనల్స్‌కూ రిజర్వ్ డే అందుబాటులో ఉందని పేర్కొంది. 15వ తేదీన మ్యాచ్ పూర్తిగా రద్దయితే 17వ తేదీన రిజర్వే డే నాడు మళ్లీ ఆడొచ్చు. 16వ తేదీన జరిగే రెండో సెమీ ఫైనల్స్ వర్షం వల్ల లేదా అనివార్య కారణాల వల్ల రద్దయితే 18వ తేదీన రిజర్వ్ డే నాడు మళ్లీ ఆడొచ్చని తెలిపింది.

భారత్‌- న్యూజిలాండ్ మ్యాచ్‌కు మాత్రం వర్షం అడ్డుపడదు. బుధవారం ముంబైలో సాధారణ వాతావరణం ఉంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవుతుందని అక్యుట్ వెదర్ తెలిపింది. గంటకు 14 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తేమ శాతం 44గా రికార్డవుతుంది. మ్యాచ్ రోజున వర్షం పడే అవకాశాలు లేవు.

Story first published: Tuesday, November 14, 2023, 10:36 [IST]
Other articles published on Nov 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+