Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విజయోస్తు.. మనవడా: న్యూజిలాండ్ బ్యాటర్‌కు దిష్టి తీసిన నాయనమ్మ

Rachin Ravindra: ఐసీసీ ప్రపంచ కప్‌ 2023లో ముగింపు దశకు వచ్చేసింది. గ్రూప్స్ దశలో ఒక్కో మ్యాచ్ మాత్రమే మిగిలివుంది. న్యూజిలాండ్, శ్రీలంక మినహా అన్ని జట్లూ ఒకటి చొప్పున మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో నేడు దక్షిణాఫ్రికా- ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.

ఈ నెల 12వ తేదీన భారత జట్టు తన చివరి గ్రూప్ మ్యాచ్ ఆడబోతోంది. నెదర్లాండ్స్‌తో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక. ఈ వరల్డ్ కప్‌లో అదే చిట్టచివరిది. దీని తరువాత సెమీ ఫైనల్స్ షెడ్యూల్ అయ్యాయి. 15, 16 తేదీల్లో రెండు సెమీ ఫైనల్స్ ముగుస్తాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్.

CWC 2023, IND vs NZ 1st semifinal: Rachin Ravindra Visits Grandparents’ House in Bengaluru

గ్రూప్ దశలో ఎట్టకేలకు న్యూజిలాండ్ గెలుపు రుచి చూసింది. బెంగళూరులో శ్రీలంకను అయిదు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లల్లో 171 పరుగులకు ఆలౌట్ కాగా.. ఈ లక్ష్యాన్ని 23.2 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి ఛేదించారు బ్లాక్ క్యాప్స్.

ఈ విజయంతో తన సెమీ ఫైనల్స్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. ఇప్పటివరకు సెమీస్ చేరిన భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సరసన చేరినట్టయింది. ఇది అధికారికం కాదు. ఇంగ్లాండ్‌పై జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి తీరుపై ఇది ఆధారపడి ఉంది. భారీ తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించగలిగితేనే పాకిస్తాన్‌కు సెమీ ఫైనల్స్ అవకాశాలు ఉంటాయి.

తొలుత పాకిస్తాన్ బ్యాటింగ్‌కు దిగితే 300 పరుగులు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఇంగ్లాండ్‌ను 13 పరుగులకే ఆలౌట్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగి 300 పరుగులు చేస్తే.. ఆ లక్ష్యాన్ని పాకిస్తాన్ ఆరు ఓవర్లలోనే కొట్టాల్సి ఉంటుంది. అలా జరిగితేనే పాకిస్తాన్ నెట్ రన్‌రేట్ మెరుగు పడుతుంది. అది సాధ్యం అయ్యే పని కాదు. దీన్ని బట్టి చూస్తే- న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్స్ స్థానం ఖరారైనట్టే.

తొలి సెమీస్‌లో భారత్‌తో తలపడే జట్టు న్యూజిలాండే అవుతుంది. ఈ నెల 15వ తేదీన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. తన చివరి లీగ్ మ్యాచ్‌ను ఆడేసింది న్యూజిలాండ్. ఇక సెమీస్ కోసం ఎదురు చూస్తోంది. దీనికి ఇంకా సమయం చాలా సమయం మిగిలివుంది.

దీనితో ఆ జట్టు ఆల్ రౌండర్.. రచిన్ రవీంద్ర బెంగళూరులో తన తాతయ్య- నాయనమ్మల ఇంటికి వెళ్లాడు. అక్కడే గడిపాడు. ఇంటికొచ్చిన మనవడిని మనసారా ఆశీర్వదించారు అతని నాయనమ్మ. అతనికి దిష్టి తీశారు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దృష్టి పోవాలని, వరల్డ్ కప్ సెమీస్‌లో రాణించాలని దేవుడిని ప్రార్థించారు.

ఈ వరల్డ్ కప్‌లో అదరగొడుతున్నాడు రచిన్. ఇప్పటికే మూడు సెంచరీలను బాదాడు. రెండు హాఫ్ సెంచరీలను అందుకున్నాడు. ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లల్లో 565 పరుగులు చేశాడు. ప్రస్తుతం అతనే టాప్ స్కోరర్. ఇదే దూకుడును సెమీ ఫైనల్స్‌లో కూడా కొనసాగించాలని న్యూజిలాండ్ కోరుకుంటోంది.

Story first published: Friday, November 10, 2023, 11:20 [IST]
Other articles published on Nov 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+