Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏబీ డివిలియర్స్ రికార్డును తుడిచి పెట్టిన హిట్ మ్యాన్- ఆ ఒక్క షాట్‌

Rohit Sharma: ఐసీసీ ప్రపంచ కప్‌ 2023 లీగ్ దశలో భారత్.. తన చిట్ట చివరి మ్యాచ్‌‌ ఆడుతోంది. నెదర్లాండ్స్‌ను ఎదుర్కొంటోంది. ఈ వరల్డ్ కప్‌లో ఇదే ఆఖరి లీగ్ మ్యాచ్. దీని తరువాత సెమీ ఫైనల్స్ మొదలవుతాయి. 15, 16 తేదీల్లో రెండు సెమీ ఫైనల్స్ ముగుస్తాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.

భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు.. సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. భారత్- న్యూజిలాండ్‌‌తో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు.. నాలుగో పొజీషన్‌లో ఉన్న టీమ్‌తో ఆడటం ఆనవాయితీగా వస్తోంది. రెండో స్థానంలో ఉన్న జట్టు.. తన తరువాతి ప్లేస్‌లో ఉన్న టీమ్‌తో సెమీ ఫైనల్స్ ఆడాల్సి ఉంటుంది.

CWC 2023, IND vs NED: Rohit Sharma surpasses AB de Villiers as most sixes in a calendar year

ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్ నుంచి ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్తాన్.. వైదొలిగాయి. లీగ్ దశలోనే ఈ ఆరు జట్ల ప్రస్థానం ముగిసింది. సెమీ ఫైనల్స్‌కు చేరుకోవడానికి అవసరమైనన్ని పాయింట్లు, నెట్ రన్‌రేట్‌ను సాధించలేకపోయాయి.. ఈ ఆరు జట్లు కూడా.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. కేప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టుకు శుభారంభాన్ని ఇచ్చాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి తొలి వికెట్ భాగస్వామ్యానికి వంద పరుగులు జోడించాడు. 14 ఓవర్లల్లో ఒక వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది టీమిండియా.

శుభ్‌మన్ గిల్ మరోసారి అర్ధసెంచరీ సాధించాడు. 51 పరుగులు చేసిన అనంతరం వాన్ మీకెరెన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు గిల్. మీకెరెన్ వేసిన డెలివరీని డీప్ బ్యాక్‌వర్డ్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అక్కడే కాచుకుని ఉన్న నెదర్లాండ్స్ ప్లేయర్ తేజ నిడమానూరు అద్భుతంగా దాన్ని అందుకున్నాడు. తన తల మీదుగా ఫెన్సింగ్ దాటుతున్న బంతిని గాల్లోకి ఎగిరి మరీ ఒడిసి పట్టుకున్నాడు. దీనితో 100 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది భారత్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ క్రీజ్‌లో ఉన్నారు.

CWC 2023, IND vs NED: Rohit Sharma surpasses AB de Villiers as most sixes in a calendar year

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును తుడిచి పెట్టాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఆడిన వన్డే ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఆవిర్భవించాడు హిట్ మ్యాన్. ఈ మ్యాచ్‌లో 59వ సిక్సర్‌‌‌ను కొట్టాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ దక్షిణాఫ్రికాకు చెందిన మిస్టర్ 360 డిగ్రీస్ ఏబీ డివిలియర్స్ పేరు మీద ఉండేది. ఏబీ ఓ క్యాలెండర్ ఇయర్‌లో 58 సిక్సర్లు కొట్టగా.. ఇప్పుడది చెరిగిపోయింది.

ఈ వరల్డ్ కప్‌లో జట్టు సాధిస్తోన్న రుస విజయాల్లో కెేప్టెన్‌గా, జట్టు ఓపెనర్‌గా కీలక పాత్రను పోషిస్తోన్నాడు రోహిత్ శర్మ. దక్షిణాఫ్రికా, ఇదివరకు శ్రీలంకను వంద పరుగులు కూడా దాటనివ్వలేదు. బ్యాటర్‌గా భారీ స్కోర్లు చేస్తూనే.. సమయానుకూలంగా బౌలర్లను మార్చ గలుగుతున్నాడు. స్పిన్నర్లు సమర్థవంతంగా వినియోగించుకుంటోన్నాడు.

Story first published: Sunday, November 12, 2023, 15:15 [IST]
Other articles published on Nov 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+