Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా పగ్గాలు కేఎల్ రాహుల్‌ చేతికి..?!

ఐసీసీ ప్రపంచ కప్‌ 2023లో ముగింపు దశకు వచ్చేసింది. గ్రూప్స్ దశలో ఒక్కో మ్యాచ్ మాత్రమే మిగిలివుంది. నేడు రెండు మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా- బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.

రెండోది- మధ్యాహ్నం 2 గంటలకు కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో. ఇంగ్లాండ్‌ను ఢీకొడుతుంది పాకిస్తాన్. గ్రూప్ దశలో ఈ నాలుగు జట్లకూ ఇవే చివరి మ్యాచ్‌లు. ఇందులో ఆస్ట్రేలియా ఒక్కటే సెమీ ఫైనల్స్‌కు చేరింది. మిగిలిన మూడూ ఇంటిదారి పట్టక తప్పదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్.. సెమీ ఫైనల్స్ రేసు నుంచి వైదొలిగాయి.

CWC 2023, IND vs NED: India playing 11 against Netherlands

ఇక భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను ఆదివారం ఆడబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. నెదర్లాండ్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌తో వరల్డ్ కప్ 2023 లీగ్స్ దశకు తెర పడుతుంది. ఇక సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌పై అందరి దృష్టీ నిలుస్తుంది.

ఈ నెల 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ జరుగుతాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. 15వ తేదీన జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌ను ఢీకొడుతుంది న్యూజిలాండ్. దీనికి ముంబైలోని వాంఖెడె స్టేడియం వేదిక. ఆ మరుసటి రోజున కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాను ఎదుర్కొంటుంది ఆస్ట్రేలియా. 19 నాటి ఫైనల్‌కు గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యాన్ని ఇస్తుంది.

నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌కు పెద్దగా ప్రాధాన్యత లేదనే అనుకోవచ్చు. టీమిండియా గెలిస్తే తన పాయింట్లను మరింత పెంచుకుంటుంది. 16 నుంచి 18కి చేరుతుంది. లీగ్స్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని జట్టుగా పేరు తెచ్చుకుంటుంది. నెదర్లాండ్స్ ఇప్పటికే సెమీస్ రేసు నుంచి వైదొలగినందున ఆ జట్టుకూ పెద్దగా వచ్చే లాభనష్టాలు ఏవీ ఉండవు.

ఈ నేపథ్యంలో- కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది టీమిండియా మేనేజ్‌మెంట్. సీనియర్లకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది. రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు రెస్ట్ ఇవ్వొచ్చు. అదే జరిగితే- వైస్ కేప్టెన్ కేఎల్ రాహుల్‌ ఈ మ్యాచ్ కోసం జట్టు పగ్గాలను అందుకునే ఛాన్స్ ఉంది.

జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాల్సి వస్తే.. అతని స్థానంలో శార్దుల్ ఠాకూర్‌‌ను తుదిజట్టులోకి తీసుకోవచ్చు. అదే సమయంలో రవీంద్ర జడేజా స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకుంటారని తెలుస్తోంది. విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ తుదిజట్టులో కొనసాగుతారు.

నెదర్లాండ్స్‌పై ఆడే భారత తుదిజట్టులో- రోహిత్ శర్మ (కేప్టెన్), శభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఆడే అవకాశం ఉంది.

Story first published: Saturday, November 11, 2023, 11:41 [IST]
Other articles published on Nov 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+