శుభం పలకవయ్యా శాస్త్రీ: వరల్డ్ కప్ కోసం 12 ఏళ్లు ఎదురు చూడక తప్పదట
Ravi Shastri: ఐసీసీ ప్రపంచ కప్ 2023 లీగ్ దశలో భారత్.. తన చిట్ట చివరి మ్యాచ్ ఆడుతోంది. నెదర్లాండ్స్‌ను ఎదుర్కొంటోంది. ఈ వరల్డ్ కప్‌లో ఇదే ఆఖరి లీగ్ మ్యాచ్. దీని తరువాత సెమీ ఫైనల్స్ మొదలవుతాయి. 15, 16 తేదీల్లో రెండు సెమీ ఫైనల్స్ ముగుస్తాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
నెదర్లాండ్స్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత్. కేప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టుకు శుభారంభాన్ని ఇచ్చాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి తొలి వికెట్ భాగస్వామ్యానికి వంద పరుగులు జోడించాడు. 14 ఓవర్లల్లో ఒక వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది టీమిండియా.

ఈ నెల 15వ తేదీన తొలి సెమీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను ఎదుర్కొనబోతోంది భారత్. ముంబైలోని వాంఖెడే స్టేడియం దీనికి వేదిక. దీనికి ప్రాక్టీస్‌గా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌ను వినియోగించుకుంటోంది. బ్యాటింగ్ ఎంచుకోవడానికి అదే ప్రధాన కారణం కూడా. తొలుత బ్యాటింగ్‌లో, అనంతరం బౌలింగ్‌లో సత్తా చాటనుంది.
లీగ్స్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు భారత్. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లలో ఘన విజయం సాధించింది. 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక నెదర్లాండ్స్‌ను కూడా ఓడించడం లాంఛనప్రాయమే అవ్వొచ్చు. విజయంతో లీగ్స్‌ను ముగించడానికి ఉవ్విళ్లూరుతోంది.
ఈ పరిస్థితుల్లో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్‌ను ముద్దాడటానికి భారత్‌కు ఇది మంచి సమయమని అన్నారు. ఇప్పుడు గనక ఈ అవకాశాన్ని చేజార్చుకుంటే మాత్రం ఇక ఇప్పట్లో వరల్డ్ కప్‌ను గెలుచుకోలేదనీ అభిప్రాయపడ్డారు.
ప్రపంచ కప్‌ను గెలుచుకోవడానికి అన్ని విధాలుగా జట్టుకు అవకాశాలు ఉన్నాయని, వాటిని కోల్పోతే మాత్రం కనీసం మూడు వరల్డ్ కప్ టోర్నమెంట్ల వరకు ఎదురు చూడక తప్పదనీ అన్నారు. దీనికి గల కారణాలనూ ఆయన వివరించారు. ప్రస్తుతం జట్టులో ఉన్న ప్లేయర్ల వయస్సును ప్రాతిపదికగా తీసుకున్నారు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ.. ఇలా ఏడెనిమిది మంది కీలక ప్లేయర్ల వయస్సు బట్టి చూస్తే వరల్డ్ కప్ 2027 నాటికి రిటైర్ అవ్వొచ్చని, మళ్లీ అలాంటి ఆటగాళ్లను తయారు చేసుకోవడానికి సమయం పడుతుందని రవిశాస్రి అన్నారు. ఇప్పుడు కొంతమంది ప్లేయర్లు ఉన్నప్పటికీ.. వారిలో నిలకడ లోపించిందని వ్యాఖ్యానించారు.
కొంతమంది కీలక ఆటగాళ్లకు ఇదే చివరి వరల్డ్ కప్ కావొచ్చని రవిశాస్త్రి అన్నారు. వరల్డ్ కప్ కోసం దేశం మొత్తం ఎదురు చూస్తోందని, చివరిసారిగా 12 ఏళ్ల కిందట దీన్ని భారత్ గెలిచిందని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు అవకాశం వచ్చిందని, దీన్ని పోగొట్టుకోకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications