Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ క్రికెట్‌ శాసించేది అతనొక్కడే: వసీం అక్రమ్

Jaspreet Bumrah: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఆరు విజయాలతో సెమీ ఫైనల్స్ వైపు దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ తరువాత దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియంలో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది రోహిత్ సేన. 50 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 229 పరుగులే చేయగలిగింది. రోహిత్ శర్మ మరోసారి కేప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. 87 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్-49, కేఎల్ రాహుల్- 39 పరుగులు చేశారు.

CWC 2023, IND vs ENG: Wasim Akram praises Jaspreet Bumrah ascompletebowler

230 పరుగుల టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ చేతులెత్తేసింది. ప్రారంభం నుంచే తడబడింది. ఏ ఒక్కరు కూడా కుదురుగా క్రీజ్‌లో నిల్చోలేకపోయారు. 27 పరుగులు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్.. టాప్ స్కోరర్ అంటే మిగిలిన వారు ఎంత అధ్వాన్నంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ క్లాస్ బ్యాటర్లు జో రూట్, బెన్ స్టోక్స్.. కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు.

బ్యాటింగ్‌లో తడబడినప్పటికీ.. టీమిండియా బౌలింగ్ డిపార్ట్‌మెంట్ అద్భుతంగా రాణించింది. బలమైన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ వెన్ను విరిచింది. 129 పరుగులకే కుప్పకూల్చింది. మహ్మద్ షమీ- 4, జస్‌ప్రీత్ బుమ్రా- 3 వికెట్లతో నిప్పులు చెరిగారు. కుల్‌దీప్ యాదవ్-2, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా.. ప్రారంభంలోనే రెండు వికెట్లు కూల్చాడు. వరుస బంతుల్లో డేవిడ్ మలన్, జో రూట్‌ను పెవిలియన్ దారి పట్టించాడు. ఆ తరువాత కూడా అతని వేగానికి బ్రేకులు పడలేదు. చివర్లో మార్క్‌వుడ్‌ను అవుట్ చేశాడు. దీనితో అతని వికెట్ల సంఖ్య 14కు చేరింది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లల్లో 14 వికెట్లు కూల్చాడీ స్టార్ పేసర్.

అతని బౌలింగ్ విధానం.. పాకిస్తాన్ లెజెండరీ ప్లేయర్ వసీం అక్రమ్‌ను కట్టిపడేసింది. బుమ్రాను ఆకాశానికెత్తేశాడు అక్రమ్. అతణ్ని కంప్లీట్ బౌలర్‌గా అభివర్ణించాడు. ఈ జనరేషన్‌లో బుమ్రా ఒక్కడే సంపూర్ణ బౌలర్ అని కితాబిచ్చాడు. సమీప భవిష్యత్తులో అతణ్ని ఢీ కొట్టేవాడు మరొకరు లేరని పేర్కొన్నాడు.

జస్‌ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్. బంతిపై అతని కంట్రోల్, పేస్, వైవిధ్యం.. ఇలా అన్నీ కలగలిసిన బౌలర్ అతను ఒక్కడే. అతని బౌలింగ్‌ విధానం చూసే వారికి ఓ ట్రీట్ ఇస్తుంది..అని అక్రమ్ వ్యాఖ్యానించాడు. కొత్త బంతి ఎలా బౌల్ చేయాలో అతనికి తెలిసినంతగా మరొకరికి తెలియదనీ పేర్కొన్నాడు.

పాకిస్తాన్ బౌలర్ల కంటే బుమ్రా అత్యంత ప్రమాదకారి అని తాను బలంగా నమ్ముతానని వసీం అక్రమ్ చెప్పాడు. వన్డే, టీ20తో పాటు ఎక్కువ టెస్ట్ క్రికెట్ ఆడటం వల్ల అతని బౌలింగ్ రాటు తేలిందని, పాకిస్తాన్ బౌలర్లు ఎక్కువ కాలం టెస్ట్ ఫార్మాట్‌లో సుదీర్ఘకాలం కొనసాగలేరని అక్రమ్ అభిప్రాయపడ్డాడు.

Story first published: Monday, October 30, 2023, 13:14 [IST]
Other articles published on Oct 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+