Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాను ఓడించడానికి ఇదే ఛాన్స్- ఇంగ్లాండ్ స్కెచ్..!!

Hardik Pandya injury: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో ప్రస్తుత ఛాంపియన్ ఇంగ్లాండ్ వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతోంది. తొలి మ్యాచ్‌లోనే తన చిరకాల ప్రత్యర్థి న్యూజిలాండ్ చేతిలో మట్టికరిచిన అనంతరం కోలుకోలేకపోతోంది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచిందా జట్టు.

ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లో ఒక్కదాంట్లో మాత్రమే విజయం సాధించింది. మూడింట్లో దారుణ పరాజయాన్ని చవి చూసింది. చివరికి ఆఫ్ఘనిస్తాన్‌పైనా ఓటమి పాలవడం.. ఇంగ్లాండ్ అధ్వాన్నపు ఆటతీరుకు అద్దం పట్టినట్టయింది. ఈ టోర్నమెంట్‌లో మున్ముందు మరిన్ని కష్టాలను ఎదుర్కొనక తప్పని పరిస్థిితులు ఉన్నాయి ఇంగ్లాండ్‌కు.

CWC 2023, IND vs ENG: Hardik Pandya likely to miss a match against England

తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓటమిపాలైంది. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై తిరుగులేని విజయం సాధించింది. తొమ్మిది వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసి, బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన అనంతరం ఇంగ్లాండ్ గాడినపడిందనే అనుకున్నారు.. గానీ అది గాలివాటమేనని తేలింది. తన మూడో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో, అనంతరం దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో చిత్తయింది.

గురువారం తన తదుపరి మ్యాచ్ ఆడబోతోంది ఇంగ్లాండ్. శ్రీలంకతో తలపడనుంది. చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి వేదిక. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఈ రెండు జట్లకూ కీలకమే ఇది. ఇందులో గెలిస్తే తమ పాయింట్లను కొద్దిపాటిగానైనా మెరుగుపర్చుకోగలుగుతాయి.

ఆ తరువాత ఇంగ్లాండ్‌కు అసలు సిసలు ఛాలెంజ్ ఎదురు కానుంది. ఈ నెల 29వ తేదీన భారత్‌తో తలపడుతుంది. ఉత్తర ప్రదేశ్ లక్నో‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియంలో జరిగే మ్యాచ్ ఇది. ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ఓటమి అనేదే తెలియని టీమిండియాను ఢీ కొట్టబోతోంది ఇంగ్లాండ్.

ఈ మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. గాయం వల్ల న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదు. దీని దెబ్బతో ఇక ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కూ దూరం అయినట్టే. గాయం నుంచి ఇంకా కోలుకోలేదీ ఆల్ రౌండర్. ప్రస్తుతం అతను జట్టుతో పాటు ఉండట్లేదు. లక్నోకూ వెళ్లట్లేదు.

బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. మడమ గాయానికి ట్రీట్‌మెంట్ తీసుకుంటోన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆడకపోవచ్చంటూ సంకేతాలు పంపించింది బీసీసీఐ మెడికల్ టీమ్. ప్రస్తుతం అతను తమ పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపింది. మ్యాచ్ నాటికి కోలుకున్నప్పటికీ.. కొద్దిపాటి విశ్రాంతి అవసరమౌతుందని తెలిపింది.

Story first published: Wednesday, October 25, 2023, 8:29 [IST]
Other articles published on Oct 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+