For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్యాట్ పట్టకూడదని రోహిత్ బలంగా కోరుకున్నాడట..: స్కూల్ బుక్‌లో లైఫ్ స్టోరీ

అహ్మదాబాద్: ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్స్‌లో భారత్‌ను ఢీ కొట్టే ప్రత్యర్థి ఎవరనేది తేలిపోయింది. రెండో సెమీ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది ఆస్ట్రేలియా. ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఈ నెల 19వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్స్‌లో భారత్‌తో తలపడుతుంది.

కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం రాత్రి జరిగిన సెమీస్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లల్లో 212 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సెంచరీ 101తో జట్టును ఆదుకోవడం వల్ల ఆ కాసిన్ని పరుగులైన చేయగలిగింది దక్షిణాఫ్రికన్లు.

 CWC 2023, IND vs AUS finals: A Chapter of Indias captain Rohit Sharmas life story in school book

అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లల్లో ఈ లక్ష్యాన్ని ఛేదించింది. ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఈ విజయంతో ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఈ ఆదివారం అహ్మదాబాద్‌లో ఫైనల్స్‌లో భారత్‌ను ఢీకొడుతుంది. ఈ మ్యాచ్ కోసం నరేంద్ర మోదీ స్టేడియం సిద్ధమైంది.

ఈ పరిస్థితుల్లో భారత జట్టు కేప్టెన్ రోహిత్ శర్మ.. ఓ గొప్ప అఛీవ్‌మెంట్‌ను సాధించారు. అతని జీవిత కథను పాఠ్యాంశంగా చేర్చారు. ఇందులో అనేక అంశాలు ఉన్నాయి. రోహిత్ శర్మ ఎక్కడ జన్మించాడు?, అతని కేరీర్ యాంబిషన్స్ ఏంటీ? క్రికెటర్‌గా ఎలా ఎదిగాడు..? వంటి అంశాలను ఇందులో ఉన్నాయి.

ఇందులో ఓ ఆసక్తికరమైన అంశం కనిపించింది. క్రికెటర్‌గా మారాలని రోహిత్ శర్మ భావించినప్పటికీ.. బ్యాట్ మాత్రం పట్టుకోకూడదని అనుకున్నాడు. ఆఫ్ స్పిన్ బౌలర్‌గా స్థిరపడాలనుకున్నాడు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్టు బ్యాటర్‌గా దుమ్ము దులపుతున్నాడు రోహిత్ శర్మ.

Story first published: Friday, November 17, 2023, 14:54 [IST]
Other articles published on Nov 17, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+