Hardik Pandya: ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్స్‌లో భారత్‌ను ఢీ కొట్టే ప్రత్యర్థి ఎవరనేది తేలిపోయింది. రెండో సెమీ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది ఆస్ట్రేలియా. ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఈ నెల 19వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్స్‌లో భారత్‌తో తలపడుతుంది.
కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం రాత్రి జరిగిన సెమీస్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లల్లో 212 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సెంచరీ 101తో జట్టును ఆదుకోవడం వల్ల ఆ కాసిన్ని పరుగులైన చేయగలిగింది దక్షిణాఫ్రికన్లు.

అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లల్లో ఈ లక్ష్యాన్ని ఛేదించింది. ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఈ విజయంతో ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఈ ఆదివారం అహ్మదాబాద్‌లో ఫైనల్స్‌లో భారత్‌ను ఢీకొడుతుంది. ఈ మ్యాచ్ కోసం నరేంద్ర మోదీ స్టేడియం సిద్ధమైంది.
దీని తరువాత టీమిండియా.. వరుసగా రెండు సిరీస్‌లను ఆడబోతోంది. టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడబోతోంది. వరల్డ్ కప్ 2023 ఆరంభానికి ముందు ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరస్ ఆరంభమైన విషయం తెలిసిందే. ఈ రెండు జట్లు కూడా మూడు వన్డే మ్యాచ్‌లను ఆడాయి. దీన్ని భారత్ 2-1తో గెలుచుకుంది.
దానికి కొనసాగింపే ఇది. నవంబర్ 19వ తేదీన వరల్డ్ కప్ 2023 ఫైనల్ ముగియనుండగా.. అదే నెల 23వ తేదీన ఈ టీ20 సిరీస్ షురూ అవుతుంది. విశాఖపట్నం స్టేడియం దీనికి వేదిక. మొత్తం అయిదు మ్యాచ్‌ల సిరీస్ ఇది. 23, 26, 28, డిసెంబర 1, 3వ తేదీల్లో ఇవి షెడ్యూల్ అయ్యాయి.
ఈ సిరీస్‌కు కూడా హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు. గాయం కారణంగా ఇప్పటికే అతను వరల్డ్ కప్ 2023 మిగిలిన మ్యాచ్‌ల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కూ అందుబాటులో ఉండట్లేదు. ఇప్పుడు ఈ మిస్సింగ్‌ల జాబితాలో మరో సిరీస్ చేరింది.
ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికాతో గేమ్ మొదలవుతుంది. మూడు చొప్పున టీ20 ఇంటర్నేషనల్స్, వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడుతుంది భారత్. డిసెంబర్ 10వ తేదీన తొలి టీ20 మ్యాచ్ మొదలవుతుంది. 12, 14 తేదీల్లో జరిగే మ్యాచ్‌లతో టీ20 ముగుస్తుంది.
అదే నెల 17, 19, 21 తేదీల్లో మూడు వన్డేలు షెడ్యూల్ అయ్యాయి. ఆ తరువాత రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ మొదలవుతాయి. 26వ తేదీన తొలి టెస్ట్ ఆరంభమౌతుంది. జనవరి 3వ తేదీన రెండో టెస్ట్ జరుగుతుంది. ఈ సిరీస్‌కూ హార్దిక్ పాండ్యా దూరం కానున్నాడు. అతను గాయం నుంచి ఇంకా కోలుకోవడానికి సమయం పడుతుందని బీసీసీఐ చెబుతోంది.