Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Pic talk: 20 ఏళ్ల నాటి పగ: ఓడిపోనీకి రెడీగా ఉండుండ్రి: చూసుకుందాం రండ్రి

కోల్‌కత: ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్స్‌లో భారత్‌ను ఢీ కొట్టే ప్రత్యర్థి ఎవరనేది తేలిపోయింది. రెండో సెమీ ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది ఆస్ట్రేలియా. ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఈ నెల 19వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్స్‌లో భారత్‌తో తలపడుతుంది.

కోల్‌కతలోని ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం రాత్రి జరిగిన సెమీస్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లల్లో 212 పరుగులకు ఆలౌట్ అయింది. మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సెంచరీ 101తో జట్టును ఆదుకోవడం వల్ల ఆ కాసిన్ని పరుగులైన చేయగలిగింది దక్షిణాఫ్రికన్లు.

CWC 2023, IND vs AUS final: Ahead of final match Ricky Ponting met Sourav Ganguly

అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లల్లో ఈ లక్ష్యాన్ని ఛేదించింది. ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఈ విజయంతో ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఈ ఆదివారం అహ్మదాబాద్‌లో ఫైనల్స్‌లో భారత్‌ను ఢీకొడుతుంది. ఈ మ్యాచ్ కోసం నరేంద్ర మోదీ స్టేడియం సిద్ధమైంది.

2003 వరల్డ్ కప్‌ ఫైనల్స్‌లోనూ ఈ రెండు జట్లే తలపడిన విషయం తెలిసిందే. జొహాన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. కప్‌ను ఎగరేసుకెళ్లింది. సరిగ్గా 20 సంవత్సరాల తరువాత ఇప్పుడు మళ్లీ ఈ రెండు జట్లే ఫైనల్స్‌లో తారసపడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

నాటి ఫైనల్స్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లల్లో రెండు వికెట్ల నషటానికి 359 పరుగులు చేసింది. కేప్టెన్ రికీ పాంటింగ్ 140 పరుగులతో చెలరేగాడు. నాటౌట్‌గా నిలిచాడు. ఆడమ్ గిల్‌క్రిస్ట్- 57, మాథ్యూ హెడెన్- 37, డేమియన్ మార్టిన్- 88 (నాటౌట్) పరుగులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.

ఈ భారీ లక్ష్యాన్ని అందుకోవడానికి బరిలోకి దిగిన భారత్.. 234 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ టాప్ స్కోరర్. 82 పరుగులు చేశాడు వీరూ. రాహుల్ ద్రావిడ్ 47 పరుగులు చేశాడీ మ్యాచ్‌లో. మరెవరూ భారీ స్కోర్లను సాధించలేకపోయారు. గ్లెన్ మెక్‌గ్రాత్-3 వికెట్లు పడగొట్టాడు. బ్రెట్‌లీ, ఆండ్రూ సిమండ్స్ రెండు చొప్పున వికెట్లు తీసుకున్నారు.

భారత్‌కు సౌరవ్ గంగూలీ, ఆస్ట్రేలియాకు రికీ పాంటింగ్ సారథ్యాన్ని వహించారు అప్పట్లో. ఇప్పుడు తాజాగా ఈడెన్ గార్డెన్స్‌లో మళ్లీ వాళ్లిద్దరూ కలుసుకున్నారు. సరిగ్గా 20 సంవత్సరాల తరువాత మళ్లీ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఈ రెండు జట్లే ఆడబోతోన్నాయి. ఈ 20 ఏళ్ల నాటి పగ, ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఉంది భారత్.

Story first published: Friday, November 17, 2023, 9:29 [IST]
Other articles published on Nov 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+