Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డేవిడ్ వార్నర్‌కు ఆ సందేశాన్ని పంపించిన అల్లు అర్జున్..!!

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా సినిమా పుష్ప 2- ది రూల్. పాన్ ఇండియా మూవీ ఇది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. పుష్ప- ది రైజ్ పార్ట్ 1కు సీక్వెల్ ఇది. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొంటోంది మూవీ.

తమిళ నటుడు విజయ్ సేతుపతి, మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాజిల్, రష్మిక మందన్న, అనసూయ భరద్వాజ్, ప్రియమణి, సునీల్.. ఇతర కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. సుకుమార్ దర్శకుడు. సుమారు 500 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతోంది ఈ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్నాయి.

CWC 2023, HBD David Warner: Allu Arjuns birthday wishes Australias opener

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన పుష్ప 2 సినిమాను విడుదల చేయనున్నట్లు యూనిట్ ఇదివరకే ప్రకటించింది కూడా. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. ఈ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేసింది.

పుష్ప- ది రైజ్.. ఓ ట్రెండ్‌ను సెట్ చేసిన మూవీ. తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ కనపర్చిన మేనరిజం.. ప్రపంచం మొత్తాన్నీ ఆకట్టుకుంది. దీని పట్ల చాలామంది దీనికి ఆకర్షితులయ్యారు. తరచూ ఈ మేనరిజాన్ని ప్రదర్శిస్తుంటారు. ప్రత్యేకించి- స్పోర్ట్స్ ఈవెంట్స్, ఐపీఎల్, క్రికెట్ మ్యాచ్‌లల్లో ఈ మేనరిజం ఎక్కువగా కనిపిస్తుంటుంది.

ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. దీనికి పెద్ద అభిమాని కూడా. మొన్నటికి మొన్న వరుసగా రెండు మ్యాచ్‌లల్లో సెంచరీ చేసినప్పుడూ అల్లు అర్జున్‌ను ఇమిటేట్ చేశాడు. టోర్నమెంట్స్, సిరీస్‌లు ఏవీ లేనప్పుడు అల్లు అర్జున్‌లా డాన్స్ చేయడానికీ ప్రయత్నించాడు వార్నర్.

పుష్ప తరువాత తనకు పెద్ద ఫ్యాన్‌గా మారిన డేవిడ్ వార్నర్‌కు బర్త్ డే విషెస్ తెలిపాడు అల్లు అర్జున్. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అతనికి విషెస్ పంపించాడు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు ద క్రికెట్ సూపర్ స్టార్ అని ఇన్‌స్టాలో రాశాడు. దీన్ని డేవిడ్ వార్నర్‌కు ట్యాగ్ చేశాడు. వార్నర్ ఫొటోను దీనికి యాడ్ చేశాడు.

Story first published: Friday, October 27, 2023, 15:03 [IST]
Other articles published on Oct 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+