Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్ మధ్యలోనే ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్

David Willey: ఐసీసీ వరల్డ్ కప్ 2023లో ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్న జట్లు ఏవైనా ఉన్నాయంటే అవి- ఇంగ్లాండ్, పాకిస్తాన్‌లే. నాసిరకం ఆటతీరును ప్రదర్శిస్తోన్నాయా రెండు జట్లూ. అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తోన్నాయి. ఈ రెండూ గతంలో వరల్డ్ కప్ ఛాంపియన్‌గా నిలిచినవే.

ఇంగ్లాండ్ తన స్థాయి తగ్గట్లుగా ఆడట్లేదు. 2019లో ఛాంపియన్‌గా నిలిచిన ఆ జట్టు ఇప్పుడు సెమీ ఫైనల్స్‌కు కూడా చేరుకోలేని దుస్థితిని ఎదుర్కొంటోంది. గ్రూప్ దశలోనే ఇంటి దారి పట్టడం దాదాపుగా ఖాయం చేసుకుంది. వరుస ఓటములు ఆ జట్టును వెంటాడుతున్నాయి. కొమ్ములు తిరిగిన ప్లేయర్లు ఉన్నప్పటికీ.. ఒడ్డున పడట్లేదు.

 CWC 2023: Englands seamer David Willey announced his retirement

బ్యాటర్లు, బౌలర్లు సమష్ఠిగా విఫలమౌతోన్నారు. ఫీల్డింగ్‌లోనూ చెప్పుకోదగ్గ మెరుపులేవీ కనిపించట్లేదు. ఇక ముందు కూడా పుంజుకుంటుందనేది అనుమానమే. ఈ పరిస్థితుల్లో ఈ నెల 4వ తేదీన తన తదుపరి మ్యాచ్ ఆడబోతోంది ఇంగ్లాండ్. ఆస్ట్రేలియాను ఢీ కొట్టబోతంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం దీనికి వేదిక.

నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న ఇంగ్లాండ్‌ జట్టుకు షాక్ ఇచ్చాడు స్టార్ ఫాస్ట్ బౌలర్ డేవిడ్ విల్లే. వరల్డ్ కప్ కొనసాగుతుండగానే తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఈ వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ ఆడబోయే చిట్టచివరి మ్యాచ్.. తనకు కూడా ఆఖరు అవుతుందని వెల్లడించాడు.

డేవిడ్ విల్లే వయస్సు 33 సంవత్సరాలే. అయినప్పటికీ- అతను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ అతని కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించలేదు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదని, ఇంకా క్రికెట్ ఆడే సామర్థ్యం తనకు ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.

అన్ని కోణాల్లో ఆలోచించిన తరువాతే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నానని, వరల్డ్ కప్‌లో తాను ఆడబోయేదే చివరి మ్యాచ్ అవుతుందని డేవిడ్ విల్లే వ్యాఖ్యానించాడు. జాతీయ జట్టు తరఫున ఆడినందుకు గర్వపడుతున్నానని, ఇక తన భార్యబిడ్డలు, తల్లిదండ్రుల కోసం సమయాన్ని కేటాయిస్తానని పేర్కొన్నాడు.

ఇప్పటివరకు 70 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడిన విల్లే 94 వికెట్లు పడగొట్టాడు. 43 టీ20 ఇంటర్నేషనల్స్‌లో 51 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లల్లో ఆరు వికెట్లు కూల్చాడు. 2/16 అతని బెస్ట్ బౌలింగ్.

Story first published: Wednesday, November 1, 2023, 15:14 [IST]
Other articles published on Nov 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+